Flash: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్
మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కరోనా టెస్ట్ చేయించుకున్నానని,
Megastar Chiranjeevi Corona: మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కరోనా టెస్ట్ చేయించుకున్నానని, ఫలితాల్లో పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. ప్రస్తుతం హో క్వారంటైన్‌లో ఉన్నానని పేర్కొన్నారు. గత 4-5 రోజులుగా తనను కలిసి వారు టెస్ట్ చేయించుకోవాలని చిరంజీవి కోరారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని చెబుతానని ఫ్యాన్స్‌కి భరోసా ఇచ్చారు. అయితే చిరంజీవి సోదరుడు, నటుడు నాగబాబుకు కూడా ఆ మధ్యన కరోనా సోకగా.. ఆయన కోలుకున్నారు. కాగా రెండు రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున ఇద్దరు ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిశారు. ఇక ఇవాళ్టి నుంచి ఆచార్య షూటింగ్ తిరిగి ప్రారంభం కావాల్సి ఉండగా.. చిరుకు కరోనాతో మళ్లీ వాయిదా పడింది.
Read More:
యాప్ డౌన్‌లోడ్ చేశాడు.. 9 లక్షలు పోయాయి
అమెరికాలో కోటి దాటేసిన కరోనా కేసులు
ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను. pic.twitter.com/qtU9eCIEwp
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 9, 2020