AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijayendra prasad: తెలంగాణలో నంది అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయేంద్ర ప్రసాద్‌.. ఏమన్నారంటే.

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో నంది అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ అవార్డుల ప్రధానోత్సవంలో జాప్యం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా...

Vijayendra prasad: తెలంగాణలో నంది అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేసిన విజయేంద్ర ప్రసాద్‌.. ఏమన్నారంటే.
Vijayendra Prasad
Narender Vaitla
|

Updated on: Apr 10, 2023 | 4:33 PM

Share

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో నంది అవార్డులను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా ఈ అవార్డుల ప్రధానోత్సవంలో జాప్యం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా నంది అవార్డులు ఇవ్వాలని కోరారు.

సోమవారం హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు అవార్డులని సూచించారు. తెలంగాణను కొత్తగా చూపించే చిత్రాలను ప్రభుత్వం ప్రోత్సహించాలన్న విజయేంద్ర ప్రసాద్‌.. 90 శాతం సినిమా స్థానికంగా చేస్తే రాయితీలతో పాటు అవార్డులు ఇవ్వాలని ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.

చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న విజయేంద్ర ప్రసాద్‌.. దీని ద్వారా రాష్ట్రం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. సినిమా మాధ్యమం అనేది చాలా శక్తిమంతమైందని, తెలంగాణలో చాలా పర్యాటక ప్రదేశాలున్నాయన్నారు. దీని ద్వారా సినిమా చిత్రీకరణ జరిగిన ప్రాంతాలు పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ‘దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రంతో స్విట్జర్లాండ్‌లో భారత పర్యాటకుల సంఖ్య పెరిగింది. తెలంగాణలోనూ ఈ విధంగా పర్యాటకరంగాన్ని ప్రోత్సహించవచ్చని ఆయన చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
వైజాగ్ వెళ్లేవారికి అదిరిపోయే శుభవార్త.. సికింద్రబాద్‌ నుంచి
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
అటుకులు పెసరపప్పు పాయసం.. ఒక్కసారి రుచి చూస్తే ప్రతి పండగకూ ఇదే..
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అలర్ట్‌.. ఆదాయపు పన్ను శాఖలో 119 ఉద్యోగాలు!
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
దసరాకు ధమాకా.. 'కింగ్ 100' నుంచి దిమ్మతిరిగే సర్‌ప్రైజ్‌
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
CM విజయ్‌ను తన పెళ్లికి ఆహ్వానించిన అనిరుధ్
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
ఇంటర్‌ విద్యార్థులకు ఊరట.. అందరికీ పబ్లిక్‌ పరీక్షలు రాసే ఛాన్స్‌
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
అద్భుతంగా ఉంది.. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి..
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
మనీ ప్లాంట్ మట్టిలో పాలు పోస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్
125 ఏళ్ల తర్వాత మళ్లీ రిపీట్.. ఈ సారి ఫిబ్రవరిలోనే పీక్ సమ్మర్