AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భరించలేనంత నడుము నొప్పితో బాధపడుతూనే యాక్షన్ సీన్లు చేసానంటున్న బ్యూటీ ఎవరో తెలుసా?

బాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘దే దే ప్యార్ దే 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. అజయ్ దేవ్‌గణ్, అయితే ఈ సీక్వెల్‌తో మరోసారి తన కామెడీ టైమింగ్ రుజువు చేసుకున్నాడు. ఈ సినిమా రకుల్​ ప్రీత్​ సింగ్​కి కూడా మంచి ..

భరించలేనంత నడుము నొప్పితో బాధపడుతూనే యాక్షన్ సీన్లు చేసానంటున్న బ్యూటీ ఎవరో తెలుసా?
Heroine12
Nikhil
|

Updated on: Nov 30, 2025 | 3:58 PM

Share

బాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన ‘దే దే ప్యార్ దే 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తోంది. అజయ్ దేవ్‌గణ్, అయితే ఈ సీక్వెల్‌తో మరోసారి తన కామెడీ టైమింగ్ రుజువు చేసుకున్నాడు. ఈ సినిమా రకుల్​ ప్రీత్​ సింగ్​కి కూడా మంచి కమ్​బ్యాక్​ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఈ సినిమా చేయడానికి తాను చాలా కష్టపడ్డానంటోంది రకుల్. ఈ సినిమా షూటింగ్​లో విపరీతమైన నడుము నొప్పితో బాధపడ్డానని ఆ విషయం చాలా కొద్దిమందికే తెలుసంటోంది.

‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్ సమయంలో రకుల్​ నడుము కండరాలు పూర్తిగా చిరిగిపోవడం వల్ల కలిగే లెవెల్-5 మస్కులర్ టియర్ సమస్యతో బాధపడింది. నడుము, కాళ్లలోకి కరెంటు షాక్ ఇస్తున్నట్లు నొప్పి. నడవడం కష్టం, నిలబడటం కష్టం, అయినా ఆ యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యాన్స్ సీక్వెన్స్‌లు పూర్తి చేసింది. రోజూ సెట్‌కు వచ్చేటప్పుడు MRI రిపోర్ట్‌ను జేబులో పెట్టుకొని వచ్చేదట. ఎందుకంటే.. ఎప్పుడైనా అకస్మాత్తుగా పడిపోతే డాక్టర్లకు చూపించడానికి!

‘నడుము నొప్పి అంత తీవ్రంగా ఉంది కానీ నేను ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోలేదు. టీమ్ మీద ఒత్తిడి పడకూడదని, ప్రొడక్షన్ లాస్ అవకూడదని భావించాను. పెయిన్‌కిల్లర్స్ వేసుకొని, ఫిజియోతో పాటు సెట్‌లోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేశాను. రోజుకు 6-8 గంటలు నిలబడి యాక్షన్ చేయాలి. ఒక్కోసారి షాట్ ఓకే అనగానే నేలపైనే పడిపోయేవాళ్లం.’ అంటూ తను ఎంత నొప్పిని భరించిందో చెప్పుకొచ్చింది రకుల్​.

Rakul P Singh

Rakul P Singh

అసలు ఈ ఇంజురీ ‘ఛత్రపతి’, ‘కొండ పొలం’ షూటింగ్ సమయంలోనే జరిగింది. కానీ ఆ బాధను దాచుకొని ‘దే దే ప్యార్ దే 2’ షూటింగ్‌లో కూడా పూర్తి ఎనర్జీతో కనిపించింది. డాక్టర్లు ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని సూచించినా వినకుండా రెండు నెలల్లోనే సెట్‌కు వచ్చేసిందట రకుల్​. ఇప్పుడు తాను పూర్తిగా కోలుకున్నానని, కానీ ఆ రోజులు ఎప్పటికీ మరచిపోలేనని చెబుతోంది.

‘నా బాడీ నన్ను వదిలేసినట్లు అనిపించిన రోజులు అవి. కానీ నేను టీమ్‌ను నిరాశపరచకూడదనే ఒక్క ఆలోచన మాత్రమే నన్ను నిలబెట్టింది’ అంటోంది రకుల్​. రకుల్​ కేవలం గ్లామర్ డాల్ మాత్రమే కాదు, బాధ్యతాయుతమైన టీమ్ ప్లేయర్, ధైర్యవంతమైన ఫైటర్ కూడా. ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ఇలాంటి గాయాలతో పోరాడుతున్నారు, కానీ ఎవరూ బయటపడరు. రకుల్ మాత్రం దాన్ని ఓపెన్‌గా చెప్పి, ఇతరులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలిచింది.