Pushpa 2 Update: పుష్పరాజ్‌ కోసం వెయట్ చేస్తున్న వర్సటైల్‌ స్టార్‌.. ఆ కల నెరవేరుతుందా?

| Edited By: Janardhan Veluru

Jul 09, 2022 | 3:52 PM

Fahadh Faasil: ఇతర భాషల్లో ఫహద్‌ పరిస్థితి పాజిటివ్‌గానే ఉన్నా... హోం గ్రౌండ్‌లో మాత్రం ఇమేజ్‌ డ్యామేజ్ అయ్యింది. కోవిడ్ టైమ్‌లో వరుసగా నాలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావటంతో..

Pushpa 2 Update: పుష్పరాజ్‌ కోసం వెయట్ చేస్తున్న వర్సటైల్‌ స్టార్‌.. ఆ కల నెరవేరుతుందా?
Fahadh Faasil
Follow us on

Fahadh Faasil: కోవిడ్ పాండమిక్ తర్వాత ఒక్కసారిగా నేషనల్ లెవల్‌లో బజ్ క్రియేట్‌ చేశారు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్‌. అప్పటి వరకు మల్లువుడ్‌కి మాత్రమే పరిమతమైన ఫాహద్.. కోవిడ్ టైమ్‌లో ఓటీటీ రిలీజ్‌లతో నేషనల్‌ స్టార్‌గా మారారు. కానీ ఆ ఇమేజ్‌ ఇప్పుడు ఫాహద్‌ను ఇబ్బంది పెడుతోందట. అందుకే.. పుష్ప 2తో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు ఈ వర్సటైల్‌ స్టార్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ఫహద్ ఫాజిల్‌.. మాలీవుడ్‌లో ప్రయోగాలకు కేరాఫ్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో. విలక్షణ పాత్రలతో మలయాళ ప్రేక్షకులను అలరించిన ఫాహద్‌.. కోవిడ్ టైమ్‌లో ఓటీటీలో రిలీజ్ అయిన డబ్బింగ్ సినిమాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. దీంతో అదర్‌ లాంగ్వేజెస్‌ నుంచి కూడా ఫాహద్‌కు ఆఫర్స్‌ రావటం మొదలైంది.

ఇతర భాషల్లో ఫహద్‌ పరిస్థితి పాజిటివ్‌గానే ఉన్నా… హోం గ్రౌండ్‌లో మాత్రం ఇమేజ్‌ డ్యామేజ్ అయ్యింది. కోవిడ్ టైమ్‌లో వరుసగా నాలుగు సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావటంతో ఓటీటీ సూపర్‌ స్టార్ అన్న ముద్ర పడిపోయింది. దీంతో ఈ హీరోతో సినిమా చేస్తే.. అది డిజిటల్‌ రిలీజ్‌కే వెళ్లాల్సి వస్తుందేమో అన్న డైలమాలో పడిపోయారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

Fahadh Faasil

అదర్‌ లాంగ్వేజెస్‌లో భారీ చిత్రాలు చేస్తుండటంతో మలయాళ మూవీస్‌కి టైమ్ ఇవ్వలేకపోతున్నారు ఈ స్టార్ హీరో. రీసెంట్‌గా కమల్‌ హాసన్ విక్రమ్ సినిమాలో కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో ఇంపార్టెంట్‌ రోల్‌లోనే నటించినా.. ఫహద్‌కు కెరీర్ పరంగా పెద్దగా ప్లస్ అవ్వలేదు. సక్సెస్‌ క్రెడిట్‌ అంతా కమల్‌ హాసన్ ఖాతాలోకి వెళ్లిపోవటం… సూర్య చేసిన రోలెక్స్ క్యారెక్టర్‌ వైరల్‌ కావటంతో ఫహద్ పేరు పెద్దగా వినిపించలేదు.

ఇప్పుడు తన మెయిన్‌ టార్గెట్‌ పుష్ప 2 అని ఫిక్స్ అయ్యారు ఈ టాలెంటెడ్‌ స్టార్‌. పుష్ప 1లో కొద్ది సేపు మాత్రమే కనిపించిన భన్వర్ సింగ్ షెకావత్‌ క్యారెక్టర్.. పుష్ప 2లో మెయిన్‌ విలన్‌గా అలరించనుంది. అందుకే ఈ సినిమాతో సూపర్‌ హిట్‌ కొట్టి మళ్లీ థ్రియెట్రికల్‌ లీగ్‌లో ఫామ్‌లోకి రావాలని ఫిక్స్ అయ్యారు ఫహద్‌. మరి ఈ మలయాళ స్టార్ ఆశలు పుష్ప 2 నెరవేరుస్తుందా? వేచి చూడాల్సిందే.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..