Cobra: విక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. థియేటర్లలో కోబ్రా సందడి ఎప్పుడంటే..
ఇప్పుడు ఈ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. డైరెక్టర్ ఆర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
తమిళ్ స్టార్ హీరో విక్రమ్ చియాన్ (Vikram) గురించి చెప్పాల్సిన పనిలేదు. అనేక సూపర్ హిట్స్ చిత్రాలు, బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్న ఈ హీరో తమిళంలోనే కాదు.. తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ప్రయోగాత్మక చిత్రాలతో దక్షిణాది సినీ పరిశ్రమలోనే ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇప్పుడు ఈ హీరో ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కోబ్రా. డైరెక్టర్ ఆర్ అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ బిజినెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న ఎన్వీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ‘కోబ్రా’ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్న ఈ చిత్రంలో విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హరీష్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.
The Grand Audio Launch Of #Cobra on July 11 at #PhoenixMarketcityChennai#PalladiumChennai with the PRESENCE OF #CHIYAANVIKRAM ?
An @arrahman Musical ? An @AjayGnanamuthu Film ?@Udhaystalin @RedGiantMovies_ @IrfanPathan @SrinidhiShetty7 @SonyMusicSouth #CobraAudioLaunch pic.twitter.com/bqIgAGR5Cm
— Seven Screen Studio (@7screenstudio) July 8, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.