AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen: అతడు మారడు.. ఆమె వెళ్లిపోతుంది.. బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిన మాజీ ప్రపంచ సుందరి..?

Sushmita Sen: మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టు గురించి

Sushmita Sen: అతడు మారడు.. ఆమె వెళ్లిపోతుంది.. బాయ్‌ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిన మాజీ ప్రపంచ సుందరి..?
uppula Raju
|

Updated on: Feb 11, 2021 | 6:23 PM

Share

Sushmita Sen: మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టు గురించి అభిమానులు, ప్రేక్షకులు వీపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. సుస్మితాసేన్ బాయ్‌ఫ్రెండ్ రోహ్‌మ‌న్ షాల్‌తో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరు విడిపోతున్నారా.. అంటే ఈ పోస్టుకు అదే అర్థం వస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

2018 నుంచి సుస్మిత – రోహ్‌మ‌న్ స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. అయితే త‌న వ్యక్తిగ‌త జీవితం గురించి ఓ పోస్ట్ పెట్టి త‌న ఫాలోవ‌ర్లకు ఒకింత షాక్‌కు గురిచేసింది సుస్మిత‌. ‘స‌మ‌స్య ఏంటంటే అత‌డు మారుతాడ‌ని మహిళ భావిస్తుంది. కానీ అత‌డు మార‌డు. పురుషులు చేసే త‌ప్పును ఆమె ఎప్పటికీ క్షమించ‌దు. ఆమె వ‌దిలి వెళ్లిపోతుంది. ఈ క‌థ‌లో నీతి ఏంటంటే అత‌డు మార‌డు. ఆమె వెళ్లిపోతుంది..’ అంటూ పోస్ట్ పెట్టింది సుస్మితాసేన్‌. దీంతో ఈ పోస్టుపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. సుస్మితాసేన్ పెట్టిన సందేశంతో బాయ్‌ఫ్రెండ్ రోహ్‌మ‌న్‌కు దాదాపు బ్రేక‌ప్ చెప్పింద‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే ఇదే విష‌యంపై నెటిజ‌న్లు క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్కో నెటిజ‌న్లు ఒక్కో విధంగా కామెంట్లు పెడుతున్నారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత ఇటీవ‌లే ఆర్య వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది సుస్మితా సేన్. అయితే ఈ పోస్టుపై క్లారిటీ రావాలంటే మాత్రం కచ్చితంగా సుస్మితా సేన్ స్పందించాల్సిందే. అప్పుడే అసలు విషయం బయటికొస్తుంది.

Anasuya: పోస్టల్ స్టాంప్‌పై అన‌సూయ ఫొటో.. ఆశ్చర్యపోతున్న అభిమానులు.. కారణాలు ఇలా ఉన్నాయి..

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..