Ekta Kapoor: ఆ సీరియల్ కోసం అంత బడ్జెటా?.. తీవ్ర ఒత్తిడిలో బిగ్‌బాస్ బ్యూటీ..

సాధారణంగా సినిమాలను తెరకెక్కించాలంటే రూ. వందల కోట్లను ఖర్చుపెడుతుంటారు దర్శక నిర్మాతలు. అయితే బాలీవుడ్ కు చెందిన ఓ అగ్రనిర్మాత సీరియల్ కోసం  వందల కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుపెట్టింది.

Ekta Kapoor: ఆ సీరియల్ కోసం అంత బడ్జెటా?.. తీవ్ర ఒత్తిడిలో బిగ్‌బాస్ బ్యూటీ..
Follow us
Basha Shek

|

Updated on: Feb 02, 2022 | 10:46 AM

సాధారణంగా సినిమాలను తెరకెక్కించాలంటే రూ. వందల కోట్లను ఖర్చుపెడుతుంటారు దర్శక నిర్మాతలు. అయితే బాలీవుడ్ కు చెందిన ఓ అగ్రనిర్మాత సీరియల్ కోసం  వందల కోట్లను మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుపెట్టింది. ఆమె బాలాజీ టెలీఫిల్మ్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ (Ekta Kapoor).  హిందీ బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తోన్న సీరియల్స్ లో ‘నాగిన్’ (Naagin) కూడా ఒకటి. 2015లో ప్రారంభమైన ఈ సీరియల్  ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకుంది. తెలుగులో కూడా మొదటి రెండు సీజన్​లు ప్రసారమయ్యాయి. వాటికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.  కాగా ఇప్పుడు తాజాగా ఈ సీరియల్ ఆరో సీజన్ రాబోతుంది.  ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో విజేతగా నిలిచిన తేజస్వీ ప్రకాశ్ (Tejasswi Prakash) ప్రధాన పాత్రలో నటించింది.

కాగా ఈ ధారావాహిక గురించి బాలీవుడ్ లో ఓ ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతోంది.  ‘నాగిన్’ ఆరో సీజన్ కోసం నిర్మాత భారీగానే ఖర్చు పెట్టిందట. గత సీజన్ల కంటే విజువల్ ఎఫెక్ట్స్ బాగా ఉండాలన్న కారణంతో ఏకంగా రూ. 130 కోట్లను ఈ సీరియల్ కోసం ఖర్చు పెట్టారంట. ఈ భారీ బడ్జెట్​తో ఒక సినిమానే  తెరకెక్కించవ్చని ఏక్తాకు పలువురు చెప్పినా  ఆమె వినలేదట.  విజువల్ ఎఫెక్ట్స్ తో ఎంతో గ్రాండియర్ గా ఈ సీరియల్ ను తెరకెక్కించిందట. ​ఒకవేళ ఈ సీజన్​ అంతగా హిట్​ కాకపోతే వచ్చే  ఏడాది నుంచి ఈ ఫ్రాంచైజీని  నిలిపేయాలని కూడా  ఏక్తా భావిస్తోందట.  కాగా ఇప్పుడు ఇదే విషయం బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ ప్రకాశ్ ను ఒత్తిడిలో పడేసిందట.  ఆమెతో పాటు మరో నటుడు సింబా నాగ్ పాల్ తెగ ఆందోళన చెందుతున్నారట.   కాగా ‘నాగిన్ 6’  ఫిబ్రవరి 12 నుంచి కలర్స్​ ఛానెల్​లో ప్రతి శనివారం, ఆదివారం ప్రసారం కానుంది.

Also Read: Kiran Abbavaram: నా సినిమా విడుదల రోజు కూడా ఆస్టార్ హీరో సినిమాకే వెళ్తాను.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు..

Ananya Panday: రెడ్ కలర్ డ్రెస్ లో తళుక్కుమన్న లైగర్ ముద్దుగుమ్మ.. దీని ధర ఎంతంటే..

Coronavirus: కరోనా బారిన పడిన రజనీకాంత్ కూతురు ఐశ్వర్య.. ఆస్పత్రిలో చికిత్స..