OTT Movie: ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ రీసెంట్ గ్యాంబ్లింగ్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. అయితే అంచనాలు అందుకోలేక యావరేజ్ గా నిలిచింది. అయితే దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, గ్యాంబ్లింగ్ నేపథ్యంలో సాగే సీన్స్, యాక్షన్ సీక్వెన్సులు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. సీతారామం, లక్కీ భాస్కర్ సినిమాలతో ఇక్కడి ఆడియెన్స్ కు కూడా ఫేవరెట్ హీరోగా మారిపోయాడు దుల్కర్. ఇప్పుడు అతను నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. అలా దుల్కర్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఐయామ్ గేమ్. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కయాదు లోహర్ హీరోయిన్ గా నటించింది. గతంలో ఆర్డీఎక్స్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నహాస్ హిదాయత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల మధ్య సెప్టంబర్ 03న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజైన ఈ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. కేవలం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే దుల్కర్ సల్మాన్ యాక్టింగ్, గ్యాంబ్లింగ్ నేపథ్యంలో సాగే సీన్స్, యాక్షన్ సీక్వెన్సులు అభిమానులను మాత్రం బాగా అలరించాయి. అలాగే స్టోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఉందని ప్రశంసలు వచ్చాయి.
కాగా థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ‘ఐయామ్ గేమ్’ సినిమాను ఓటీటీలోనూ ఎదురు చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో దసరా కానుకగా అక్టోబర్ 16న ‘ఐయామ్ గేమ్’ సినిమా ఓటీటలోకి రావొచ్చని సమాచారం. ఒకవేళ అక్టోబర్ 16న రాకపోయినా 23న దుల్కర్ సినిమా స్ట్రీమింగ్ కు రానుందని టాక్. తెలుగు, మలయాళంతో పాటు హిందీ, కన్నడం, తమిళం భాషల్ల ఒకేసారి దుల్కర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుందని టాక్. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన రానుంది.
‘ఐయామ్ గేమ్’ సినిమా విషయానికి వస్తే.. ఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దుల్కర్ స్వయంగా ఈ సినిమాను నిర్మించాడు. జయసుధ, మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, వినయ్ పోర్ట్, ఆంటోని వర్గీస్, కథిర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జేక్స్ బిజాయ్ స్వరాలు సమకూర్చారు. జిమ్షి ఖలీద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
దుల్కర్ సల్మాన్ ఐయామ్ గేమ్ సినిమా ట్రైలర్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




