సినిమాకు మొత్తం నెగిటివ్ రివ్యూస్.. దారుణంగా ట్రోల్ చేశారు.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద సంచలనం..
సాధారణంగా సినిమాను ఎన్నో అంచనాల మధ్య రూపొందిస్తారు. సంవత్సరాల కష్టం మొదలుకుని సినిమా విడుదలయ్యేవరకు ప్రతి ఒక్కరి కష్టం గురించి చెప్పక్కర్లేదు. అయితే సినిమా విడుదలయ్యాక మాత్రం చాలా వరకు నెగిటివ్ రివ్యూస్ వస్తుంటాయి. అలాంటి ఓ చిత్రమే తర్వాత బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రాన్ని ఏఐ ద్వారా తెరకెక్కించారు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరెంటో తెలుసా.. ?

గత వారాంలో థియేటర్లలో 6 కొత్త సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో నాలుగు బాలీవుడ్ చిత్రాలు కాగా, రెండు హాలీవుడ్ చిత్రాలు. బాక్సాఫీస్ వద్ద ఈ 6 చిత్రాల మధ్య ఒక మెగాక్లాష్ జరిగింది. కానీ ఈ మెగాక్లాష్‌లో ఒక సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ విడుదలైన వెంటనే ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు అదే సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తోంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘హాంటెడ్ 3D రిటర్న్స్’. ‘రాజ్’, ‘ఔర్’ వంటి హారర్ చిత్రాలను రూపొందించిన దర్శకుడు విక్రమ్ భట్, 2011లో ‘హాంటెడ్ 3D’ చిత్రాన్ని తీసుకువచ్చారు. ఈ సినిమా తన బడ్జెట్‌కు రెట్టింపు వసూలు చేసింది. ఆ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ వచ్చింది. ‘హాంటెడ్ 3D రిటర్న్స్’ సినిమా ప్రకటించినప్పటి నుండి ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ట్రైలర్ తర్వాత ఈ సినిమాకు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంతేకాదు సినిమాను, నటీనటులను విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ సినిమాలోని చాలా విజువల్స్‌ను ఏఐ (AI) ద్వారా రూపొందించారు. కట్ చేస్తే.. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Naga Chaitanya : అప్పుడు నాగార్జున జోడిగా.. ఇప్పుడు నాగచైతన్య సినిమాలో సీనియర్ హీరోయిన్.. ఎవరంటే..
సినిమాలో నటీనటులు, కథాంశం..
నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహా అక్షయ్ అలియాస్ మిమో ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించాడు. అలాగే ఇందులో చేత్నా పాండే కథానాయికగా నటించింది. ‘హాంటెడ్ 3D రిటర్న్స్’ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్‌లు భారీగా జరిగాయి. శుక్రవారం ఒక్కరోజే ఈ చిత్రానికి 2900కు పైగా షోలు లభించాయి. ఇది మిగతా ఏడు చిత్రాలన్నింటినీ కలిపి చూసిన దానికంటే ఎక్కువ. మొదటి రోజున రూ. 2.50 కోట్లు వసూలు చేసింది. శనివారం నాడు రూ. 3.25 కోట్లు, ఆదివారం నాడు రూ. 3.60 కోట్లు వసూలు చేసింది. ఆదివారం నాడు ఈ చిత్రం 4100 షోలతో థియేటర్లలో ప్రదర్శించారు. ఎలాంటి డబ్బు చెల్లించి ప్రచారం చేయకపోయినా, ఈ చిత్రం మొదటి వారంలో రూ. 9.35 కోట్లు వసూలు చేసింది. మహాక్లాష్‌లోని మిగతా 5 చిత్రాలను ఈ చిత్రం అధిగమించింది.
ఎక్కువ మంది చదివినవి : పెళ్లి ఫంక్షన్లలో పని.. రూ.500 జీతం కోసం ఎన్నో కష్టాలు.. కట్‌చేస్తే టాలీవుడ్ క్వీన్..
హాంటెడ్ 3D రిటర్న్స్ కలెక్షన్ వివరాలు..
‘హాంటెడ్ 3D రిటర్న్స్’తో పాటు విడుదలైన ‘మై వాప్ ఆవుంగా’ చిత్రం రూ. 5.50 కోట్లు, ‘భారత్ భాగ్య విధాత’ రూ. 4.25 కోట్లు, ‘గవర్నర్’ రూ. 3.45 కోట్లు, ‘డిస్క్లోజర్ డే’ రూ. 6.40 కోట్లు ‘బ్యాక్‌రూమ్స్’ రూ. 3.45 కోట్లు వసూలు చేశాయి. ప్రస్తుతం ఈ హారర్ మూవీ థియేటరలలో దూసుకుపోతుంది.
