మహానటితో ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు.. ఆ పాన్ ఇండియా స్టార్‌ను గుర్తుపట్టారా.?
చైల్డ్ హుడ్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం పదుల సంఖ్యలో వైరల్ అవుతూ ఉంటాయి. సినీ సెలబ్రెటీలకు సంబందించిన ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేస్తూ ఉంటారు. చాలామంది తమ అభిమాన హీరోల ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఓ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసిన నటుల్లో మహానటి సావిత్రి ఒకరు. ఆమె నటనకు, ఆమె అభినయానికి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. మహానటి సావిత్రి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాత్రకు ప్రాణం పోయడం ఆమెకే సాధ్యం అన్నంతగా జీవిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సావిత్రి. ఆమెతో నటించడానికి పెద్ద పెద్ద నటులు కూడా ఆలోచించేవారట.. దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు లాంటి నటులు కూడా సావిత్రితో నటనలో పోటీపడేవారట. అంతటి మహానటి. అయితే ఆమెకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పై ఫోటో చూశారా.? ఆ ఫొటోలో సావిత్రితో ఉన్న చిన్నోడు ఎవరో గుర్తుపట్టారా.? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తోప్ హీరో అతను.. ఇంతకూ ఆయన ఎవరో గుర్తుపట్టారా.? ఇంతకూ ఆయన ఎవరంటే.. పై ఫొటోలో మహానటి తో ఉన్నది ఎవరో కాదు..
ఆ దర్శకుడి చేతిలో మోసపోయా.. ఏడుసార్లు అబార్షన్ చేయించాడు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్. కమల్ హాసన్ బాలనటుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఆతర్వాత హీరోగా మారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి ఆకట్టుకున్నారు. విభిన్న పాత్రల్లో నటిస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు కమల్. స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కమల్ హాసన్ ద్వి పాత్రయంలోనే కాదు.. విచిత్ర సోదరులు సినిమాలో మరగుజ్జు గా కూడా నటించి మెప్పించారు.
ఉదయ్ కిరణ్ భార్య ఇప్పుడు ఎలా ఉందో.? ఏం చేస్తుందో తెలుసా.?
అంతే కాదు దశావతారం మూవీలో ఏకంగా 10విభిన్న పాత్రల్లో కనిపించి అబ్బురపరిచారు. కేవలం నాలుగేళ్ల వయస్సులో కళధూర్ కణ్ణమ్మ మూవీలో నటించిన కమల్ హాసన్ మహానటి సావిత్రితో కలిసి నటించారు. ఈ సినిమాలో సావిత్రి, జెమిని గణేశన్ జంటగా నటించారు. ఇదే సినిమా తెలుగులో మావూరి అమ్మాయి అనే పేరుతో విడుదలైంది. ఆతర్వాత పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా అలరించారు. కమల్ హాసన్ అసలు పేరు పార్ధసారధి. కమల్ హాసన్ ఓల్డ్ ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. 71ఏళ్ళ వయస్సులో కూడా యంగ్ హీరోలకు ధీటుగా నటిస్తూ అలరిస్తున్న కమల్. మొన్నామధ్య ప్రభాస్ కల్కి సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. కల్కి 2లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనుంది. అలాగే నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి కమల్ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు.
ఆమె ఇప్పుడు హీరోయినా..! అప్పట్లో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేసింది.. ఇప్పుడు ఎలా ఉందంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





