AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ గా మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు కాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు చిరు.

Chiranjeevi: చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Sep 01, 2026 | 2:16 PM

Share

మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో జోరుమీదున్న మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో కాకాగా రానున్నారు.  అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా ఏకంగా రూ. 375 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో ఇప్పుడు కాకా సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో బాబీ, చిరు కాంబినేషన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు కాకా సినిమాపై కూడా  మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని ఎవరికీ ఉండదు చెప్పండి. కానీ ఓ కమెడియన్ మాత్రం మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేశారట. గతంలో రాజకీయాలతో సుమారు 9 ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ఖైదీనంబర్ 150.

నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

వి.వి. వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో చిరంజీవితో పాటు అలీ, బ్రహ్మానందం వంటి స్టార్ కమెడియన్స్ నటించారు. ముఖ్యంగా చిరంజీవి- అలీ కాంబినేషన్స్ లో వచ్చిన సీన్లన్నీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అయితే అలీ కంటే ముందు ఈ పాత్ర కోసం ఒక స్టార్ కమెడియన్ ను అడిగారట. కానీ ఆయన ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరో తెలుసా.? గతంలో ఠాగూర్, స్టాలిన్, ఇంద్ర లాంటి సినిమాల్లో చిరంజీవితో కలిసి నటించిన సునీల్. ఇదే క్రమంలో చిరంజీవి రీ ఎంట్రీ చిత్రం ఖైదీ 150 కోసం కూడా సునీల్ ను ముందుగా సంప్రదించారట మేకర్స్.

Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ

అయితే అదే సమయంలో హీరోగా బిజీగా ఉండడంతో చిరంజీవి సినిమాను వదులుకున్నాడట సునీల్. ఈ విషయాన్నిసునిల్ స్వయంగా  ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఓ ఇంటర్వూలో దీనిపై ప్రశనించగా.. అది రిజెక్ట్ చేసినట్లు కాదు. నాకు కుదరలేదు అంతే. ఖైదీ నెంబర్ 150 కోసం నన్ను ఎంపిక చేశారు. కానీ అదే టైంలో ఈడు గోల్డ్ ఎహే అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాను. అప్పటికే ఆ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయింది. నేను ఖైదీ నెంబర్ 150 చిత్రానికి డేట్లు ఇస్తే మరోసారి నా మూవీ విడుదల వాయిదా పడుతుంది. దీనితో తప్పని పరిస్థితుల్లో ఖైదీ నెంబర్ 150 చిత్రం వదులుకోవాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు సునీల్. ఇప్పుడు సునీల్ విలన్ గా అదరగొడుతున్న విషయం తెలిసిందే

ఇవి కూడా చదవండి

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

Sunil

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే
చిరంజీవి సినిమాను రిజెక్ట్ చేసిన నటుడు.. కట్ చేస్తే
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?
భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?