Tollywood: హీరో ధోతి కట్టుకుంటాడని సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు.. కట్ చేస్తే.. రూ.400 కోట్ల కలెక్షన్స్..

ఈ హీరో కెరీర్ లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో లగాన్ ఒకటి. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి అషుతోశ్ గోవారికర్ దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అనేక అవార్డులను సొంతం చేసుకుంది. భువన్ అమీర్ నటన అందరిని కట్టిపడేసింది. అయితే ఈ సినిమాకు ముందుకు అగ్రకథానాయుకలను అనుకున్నారట.

Tollywood: హీరో ధోతి కట్టుకుంటాడని సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు.. కట్ చేస్తే.. రూ.400 కోట్ల కలెక్షన్స్..
Lagaan Movie
Follow us

|

Updated on: Aug 25, 2024 | 4:34 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోలలో అమీర్ ఖాన్ ఒకరు. హీరోయిజం కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సందేశాత్మక చిత్రాలను ఎంపిక చేసుకోవడంలో ముందుంటారు. ఈహీరో కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అప్పట్లో బాక్సాఫీస్ ఏలిన స్టార్ హీరో అమీర్ ఖాన్ కావడం విశేషం. ఈ హీరో కెరీర్ లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో లగాన్ ఒకటి. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి అషుతోశ్ గోవారికర్ దర్శకత్వం వహించారు. 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అనేక అవార్డులను సొంతం చేసుకుంది. భువన్ అమీర్ నటన అందరిని కట్టిపడేసింది. అయితే ఈ సినిమాకు ముందుకు అగ్రకథానాయుకలను అనుకున్నారట.

ముందుగా ఈ మూవీ స్క్రిప్ట్ కోసం స్టార్ హీరోలైన షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లను ఎంపిక చేయాలనుకున్నారట. ఇందులో లఖా పాత్ర పోషించిన యశ్ పాల్ శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. లగాన్ సినిమా కథను, స్క్రిప్టును ఎవరూ నమ్మలేదని.. కచ్చితంగా ప్లాప్ అవుతుందనుకున్నారని అన్నారు. జావేద్ అక్తర్ తో సహా ప్రతి ఒక్కరూ ఈ సినిమా సబ్జెక్ట్ వర్కవుట్ కాదన్నారని.. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని అన్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో ధోతి, పగ్డీ ధరించడం నచ్చలేదని.. అందుకే ఈ సినిమా చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదని తెలిపారు.

లగాన్ సినిమా స్టోరీని సెట్స్ పైకి తీసుకురావడానికి డైరెక్టర్ అషుతోష్ ఎంతో కష్టపడ్డారని.. ఈ ప్రాజెక్ట్ కోసం షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ ఇద్దరిని కలిసినా వారు ఓకే చేయలేదని అన్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఊహించని రెస్పాన్స్ వచ్చిందని.. ఆస్కార్ కు నామినేట్ కావడంతో తామంతా అమెరికా వెళ్లామని.. సరిగ్గా అదే సమయంలో 9/11 ట్విన్ టవర్స్ పై దాడి జరగడంతో దాదాపు నెల రోజులు అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు యశ్ పాల్. ఇదిలా ఉంటే లగాన్ సినిమా చేయడానికి ముందుగా అమీర్ ఖాన్ కూడా ఆసక్తి చూపించలేదు. కానీ కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారట.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
ఆవు కడుపులో 70 కేజీల ప్లాస్టిక్‌! మనం చేసే తప్పుల వల్లే మూగజీవులు
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
యుద్ధ విమానం నుంచి జారిపడ్డ సామగ్రి.! పెద్ద శబ్దంతో పోఖ్రాన్‌లో..
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
మానవత్వం చాటుకున్న ఎంపీ పురంధేశ్వరి
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
భర్త వీర్యం భద్రపరచడానికి కోర్టు అనుమతి.! సంతానానికి ఉపయోగపడేలా..
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
తెల్లారి షాప్ ఓపెన్ చేయగానే ఏవేవో శబ్దాలు.. భయంగా వెళ్లి చూడగా
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
మా నాన్నను జైల్లో పెట్టండి.తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడు..
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
కోహ్లి, ప్రియాంకా తర్వాత 3వ స్థానంలో శ్రద్ధా కపూర్‌.! ట్రేండింగ్.
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
రహస్య కెమెరాలతో నగ్న చిత్రాలు రికార్డ్‌.. అమెరికాలో భారత వైద్యుడు
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్
హమ్మయ్య.. రవితేజ సేఫ్‌.! | శృంగార సీన్లు లీక్‌.! షాక్‌లో హీరోయిన్
కుటుంబాల మద్య చిచ్చు పెట్టిన ప్రేమ వ్యవహారం.. కర్రలతో బీభత్సం
కుటుంబాల మద్య చిచ్చు పెట్టిన ప్రేమ వ్యవహారం.. కర్రలతో బీభత్సం