Samantha: ఏంటీ.. ఆ హీరోయిన్ చేయాల్సిన సాంగ్ సమంత చేసిందా.. ? క్రేజీ ఛాన్స్ మిస్సైందే..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించిన సామ్.. ఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉంది. అలాగే ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. సామ్ చేసిన ఓ సూపర్ హిట్ సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతుంది.

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా ఊహు అంటావా సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఈ పాటలో సమంత డ్యాన్స్ మూమెంట్స్, ఎక్స్ ప్రెషన్స్ మరింత హైలెట్ అయ్యాయి. అప్పట్లో ఈ సాంగ్ సోషల్ మీడియా సెన్సేషన్. అయితే ఈ పాటకు సామ్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఇటీవల జరిగిన రాబిన్ హుడ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ ఒక ఆసక్తికరమైన సమాచారాన్ని వెల్లడించారు. పుష్ప సినిమాలోని ‘ఊ అంటవా ఊహు అంటవా’ అనే పాటకు ముందుగా హీరోయిన్ కేతిక శర్మను తీసుకోవాలనుకున్నారట. రాబిన్ హుడ్ సినిమాలో కేతిక అదిదా సర్ ప్రైజు అంటూ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటలో కొన్ని స్టెప్స్ పై విమర్శలు రావడంతో సినిమాలో ఆ స్టెప్స్ తొలగించారు.
ఇటీవల జరిగిన రాబిన్ హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, ఆ చిత్ర నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. “ఈ సాంగ్ చేయడానికి అంగీకరించినందుకు కేతికకు థాంక్స్ చెప్పాలి. పుష్ప సినిమాలో ఊ అంటావా ఊహు అంటావా పాటకు ముందుగా కేతికను తీసుకోవాలని అనుకున్నాము. కానీ అది కొన్ని కారణాలతో జరగలేదు. ఈసారి మాత్రం రాబిన్ హుడ్ కోసం తీసుకున్నాం. అలాగే ఈ సినిమాలో నటించిన శ్రీలీలకు సైతం థ్యాంక్స్ ” అని అన్నారు. రాబిన్ హుడ్ సినిమాలో నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించగా.. కేతిక శర్మ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. సమంత నటించిన ఊ అంటావా.. ఊహు అంటావా సాంగ్ ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. సామ్ కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్, మైండ్ బ్లోయింగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ మరింత హైలెట్ అయ్యాయి. ఈ పాట అప్పట్లో సోషల్ మీడియాను ఊపేసింది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..