మహేష్ కూతురు సితార బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు.
02 April 2025
Basha Shek
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ గారాల పట్టి సితార ఘట్టమనేని గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే సితార ఘట్టమనేని అప్పుడే యాడ్స్, సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది.
మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమాలోని ఓ పాటలో తళుక్కున మెరిసింది సితార.
అలాగే ఓ జ్యువెలరీ యాడ్ లోనూ నటించింది. అంతేనా.. ఈ యాడ్ డబ్బులను మహేష్ బాబు ఫౌండేషన్ కు విరాళంగా కూడా ఇచ్చింది.
కాగా టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లతోనూ సితారకు మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలో ఈ స్టార్ కిడ్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిసింది.
అదేంటంటే.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అంటే సితారకు చాలా ఇష్టమట. ఆమెను తన బెస్ట్ ఫ్రెండ్ గా భావిస్తుందట.
సామ్ ఆంటీ నాకు మంచి స్నేహితురాలి లాంటి వారు. ఆమెతో గడిపిన ప్రతి క్షణం చాలా సంతోషంగా ఉండేది' అని అంటోంది సితార.
బ్రహ్మోత్సవం షూటింగ్ సమయంలో సినిమా సెట్స్‌లో సమంతతో సరదాగా గడిపానని సితార ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక్కడ క్లిక్ చేయండి..