Actor: మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. చివరకు ఎలా మానేశాడంటే?
సెలబ్రిటీలు చాలా విషయాలు దాచిపెట్టాలనుకుంటారు. ముఖ్యంగా వారికి ఏ చెడు అలవాటు ఉన్నా దానిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ స్టార్ హీరో మాత్రం అందుకు భిన్నం. తన గురించి బహిరంగంగానే మాట్లాడతాడు. మందు,మద్యపానం వంటి చెడు అలవాట్ల గురించి ఓపెన్ అవుతాడు. అంతేకాదు ఈ చెడు అలవాట్లు తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరిస్తాడు.
బాలీవుడ్లో అమీర్ఖాన్ని మిస్టర్ పర్ఫెక్ట్ అంటారు. ఆయన అభిమానుల సంఖ్య భారీగా ఉంది. అమీర్ స్టార్ హీరోనే కాదు అభిరుచి గల నిర్మాత కూడా. అయితే ఇదంతా సినిమాల వరకే. కానీ అమీర్ పర్సనల్ లైఫ్ చాలా డిఫరెంట్. గతంలో ఈ స్టార్ హీరో ఎన్నో చెడు అలవాట్లకు బానిసయ్యాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘నేను మద్యానికి బాగా బానిసయ్యాను. కొన్నిసార్లు రాత్రంతా తాగుతూనే ఉండేవాడిని. నేను నా ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ఈ అలవాట్లు నా జీవితానికి, నా వృత్తికి హానికరం అని నాకు బాగా తెలుసు. కానీ వాటిని మానుకోలేకపోయాను. అయితే క్రమంగా, నేను సినిమాని ఎక్కువగా ప్రేమించడం మొదలెట్టాను. చివరకు అదే నా జీవితాన్ని మార్చింది. వ్యసనాల కంటే సినిమాలపైనే ఆసక్తి చూపించాను. చివరకు అన్ని చెడు అలవాట్లను వదులుకున్నాను’ అని అమీర్ చెప్పుకొచ్చాడు.
ఇంతకీ అమీర్ ఖాన్ ఇప్పుడు ఎందుకు ఇలా అన్నాడు? దానికి కారణం ఉంది. అభిమానులు ఇలాంటి చెడు పద్ధతులకు పాల్పడకూడదనేది ఆయన ఉద్దేశం. అందుకే ఈ విషయాన్ని అమీర్ ఖాన్ వెల్లడించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘సితారే జమీన్పర్’ చిత్రంలో నటిస్తున్నారు. లాల్ సింగ్ చద్దా’ తర్వాత అమీర్ ఖాన్ అంగీకరించిన సినిమా ఇదే. దీంతో అభిమానుల్లో అంచనాలున్నాయి. వరుస పరాజయాలతో షాక్ తిన్న అమీర్ ఖాన్ నటన నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ఇటీవల అమీర్ ఖాన్ ప్రొడక్షన్ పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.
8 years, 1 reminder : with dedication, discipline and resilience the world is yours to conquer! ✨#8YearsOfDangal pic.twitter.com/mUvWTu2YEz
— Aamir Khan Productions (@AKPPL_Official) December 23, 2024
ఇక అమీర్ ఖాన్ నిర్మాతగా ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ మూవీ లాపతా లేడీస్. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్లో పరవాలేదనిపించినా… ఓటీటీలో ఘన విజయం సాధించింది. అంతేకాదు ఆస్కార్ బరిలో ఇండియా నుంచి పోటికి ఎంపికై మరో రికార్డ్ సెట్ చేసింది.
ఇప్పుడు సినిమా నిర్మాణంపైనే ఆసక్తి..
#17YearsOfTaareZameenPar and a timeless truth that remains, Every child is special 🪼 pic.twitter.com/MT0voF8Yx5
— Aamir Khan Productions (@AKPPL_Official) December 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.