యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), హీరోయిన్ నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన సినిమా డిజే టిల్లు (Dj Tillu). ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌ను నిర్మించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల విషయంలో ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్న డీజే టిల్లు ఓవర్సీస్‌లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈక్రమంలో త్వరలోనే డిజిటల్ మాధ్యమం ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో సందడి చేసేందుకు డీజే టిల్లు రెడీ అవుతున్నాడు.
ఈ విషయాన్ని ఆహా నిర్వాహకులే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమా పోస్టర్‌ను పంచుకుంటూ ‘ఇగ టిల్లు లొల్లి ఆహాలో అతి త్వరలోనే’ అని పేర్కొంది. కాగా ఈ సినిమా సుమారు నాలుగు వారాల థియేట్రికల్ రన్ తర్వాత ఆహాలో స్ట్రీమ్ కానుందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీసర్, ట్రైలర్ అన్నీ యూత్‌ని ఆకట్టుకున్నాయి. పాజిటివ్ బజ్ రావడంతో బిజినెస్ కూడా బాగానే జరిగింది. డిజిటల్ హక్కులు, శాటిలైట్ హక్కుల విషయంలో కూడా భారీ లెవల్‌లో బిజినెస్ జరిగిందని సమాచారం.
DJ Tillu dhummu dhulapadaniki vacchesthunnadu. Scratch untadi, ready ga undandi. #ahaLoDJTillu@Siddu_buoy @iamnehashetty @K13Vimal
@MusicThaman @vamsi84 @SricharanPakala
@NavinNooli @SitharaEnts @Fortune4Cinemas @AnindithaMedia #rammiryala pic.twitter.com/zYk6K9G5a7— ahavideoIN (@ahavideoIN) February 25, 2022
Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
Russia Ukraine War: అధికారం చేతుల్లోకి తీసుకోండి.. రష్యా ఆర్మీకి పుతిన్ కీలక సూచనలు..