ప్రభాస్‌తో జతకట్టనున్న వరుణ్ తేజ్ హీరోయిన్.. ‘సలార్’లో నటించనున్న ఆ హాట్ బ్యూటీ ?
తెలుగులో తెరకెక్కిన బహుబలి చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ 'సలార్'
తెలుగులో తెరకెక్కిన బహుబలి చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. ఇప్పటికే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ ‘సలార్’ అనే సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఇంకా కొన్ని రోజుల్లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుంది. అటు ఇప్పటికే సాహో సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధకపూర్ ప్రభాస్‌కు జోడీగా నటించింది. తాజాగా సలార్ సినిమాలోనూ మరో బాలీవుడ్ భామ నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న సలార్ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. గతంలో వరుణ్ తేజ్‌కు జోడీగా లోఫర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దిశా పటాని. కానీ ఆ సినిమా అంతగా హిట్ కాలేదు. ఆ తర్వాత దిశా పటానికి తెలుగులో సినిమా అవకాశాలు రాలేకపోయాయి. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. తాజాగా ఈ హాట్ బ్యూటీని సలార్ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా ఎంపికచేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ప్రస్తుతం దిశా పటాని సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్ ‘రాధే’ సినిమాలో నటిస్తుంది.