Disabled Dancer: ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యం ఓ లెక్కా అంటున్న ఓ యువతి..ఒంటి కాలితో సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా

Disabled Dancer: ఓ మనిషి అందం ఇతరులను ఆకర్షించేది కొంతకాలమే.. అదే ఆత్మస్థైర్యంతో బతికే వారు అందరినీ ఆకట్టుకుంటారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అంగ వైకల్యం మనిషికే..

Disabled Dancer: ఆత్మస్థైర్యం ఉంటే అంగవైకల్యం ఓ లెక్కా అంటున్న ఓ యువతి..ఒంటి కాలితో సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా
Disabled Dancer
Follow us
Surya Kala

|

Updated on: Jun 17, 2021 | 2:15 PM

Disabled Dancer: ఓ మనిషి అందం ఇతరులను ఆకర్షించేది కొంతకాలమే.. అదే ఆత్మస్థైర్యంతో బతికే వారు అందరినీ ఆకట్టుకుంటారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అంగ వైకల్యం మనిషికే కాని మనసుకేం లేదంటూ ఒంటి కాలితో నృత్యం చేసి.. వీక్షకులను వావ్ అనిపించింది. ఆమె చేసిన నాట్యం చేసిన వారు కళ్ళు తిప్పుకోలేదు. వికలాంగ నృత్యకారిణి సుబ్రీత్ కౌర్ ఘుమ్మన్ చికినీ చమేలి అనే పాటకు డ్యాన్స్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్ల హృదయాలను దోచుకుంది.

ఇండియా గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నప్పుడు సుభ్రీత్ మొదటి రౌండ్‌తో తన నాట్యంతో జడ్జిలను మెప్పించి రెండవ రౌండ్‌కు అర్హత సాధించింది. 7 సంవత్సరాల తరువాత నా మొదటి టీవీ డాన్స్ ప్రదర్శనను మళ్లీ మీకోసం షేర్ చేస్తున్నా.. మీ అందరికీ . ఇది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ చేసింది సుభ్రీత్ .

సుభ్రీత్ కౌర్ 2009 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయింది. అనంతరం వైద్యులు ఆమె కాలికి ఏడు ఆపరేషన్లు చేశారు. మొట్ట మొదటి శస్త్ర చికిత్సలోనే వైద్యులు ఏమరపాటుతో ఒక ముఖ్యమైన సిరను కత్తిరించారు. దాంతో ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఇన్ఫెక్షన్ వ్యాపించింది. దీంతో ఆమె ఒక కాలును తప్పని సరి పరిస్థితుల్లో తీసివేయాల్సి వచ్చింది. కాలు పోగొట్టుకున్నా సుభ్రీత్ దైర్యం కోల్పోలేదు.. తనకంటూ ఒక ఫేమ్ సంపాదించుకోవాడానికి మొక్కవోని దీక్షతో కృషి చేసింది. పట్టుదలతో సాధన చేస్తే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించింది. ఒంటి కాలుతోనే తనకు ఇష్టమైన నాట్యాన్ని నేర్చుకుంది.

నిజానికి సుభ్రీత్ అమ్మానాన్నకి ఆమె డ్యాన్సర్ కావడం ఇష్టం లేదు. బాగా చదువుకుని నర్స్ ఉద్యోగం చేయాలనుకున్నారు. కానీ ఆమెకు జరిగిన ప్రమాదం ఆమె జీవితాన్ని మార్చేసింది. ప్రమాదం తన కాలును తీసుకుని,తన కల నెరవేర్చుయికునే సంకల్పం ఇచ్చింది అంటున్న సుభ్రీత్ డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆమె డాన్స్‌కు , ఆత్మధైర్యానికి ఫిదా అవుతున్నారు.

Also Read: నేపాల్ లో భారీ వర్షాలు వరదల బీభత్సం.. 20 మంది గల్లంతు.. వారిలో ముగ్గురు భారతీయులు

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్