ఆ బ్లాక్‌బస్టర్‌ని విజయ్ వదులుకున్నాడు.. రివీల్ చేసిన శంకర్

యాక్షన్ కింగ్ అర్జున్ హీరో, మనీషా కొయిరాలా హీరోయిన్‌గా కోలీవుడ్ లెజండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ముదల్వాన్

ఆ బ్లాక్‌బస్టర్‌ని విజయ్ వదులుకున్నాడు.. రివీల్ చేసిన శంకర్
TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 16, 2020 | 10:39 AM

Vijay rejects Mudhalvan: యాక్షన్ కింగ్ అర్జున్ హీరో, మనీషా కొయిరాలా హీరోయిన్‌గా కోలీవుడ్ లెజండరీ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం ముదల్వాన్‌(తెలుగులో ఒకే ఒక్కడు). 1999లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. అంతేకాదు ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ మూవీ అర్జున్ కెరీర్‌కి ఎంతో ఊపును ఇచ్చింది. అందులోని ఒక్క రోజు సీఎం అన్న కాన్సెప్ట్‌ ఆ తరువాత చాలా సినిమాల్లో వాడుకున్నారు. అయితే ఈ సినిమాకు అర్జున్ మెదటి ఛాయిస్ కాదట. ఈ మూవీని శంకర్, విజయ్‌తో తెరకెక్కించాలనుకున్నారట. అయితే కొన్ని కారణాల వలన విజయ్‌ ఈ సినిమాను వద్దనుకోగా.. ఆ తరువాత అర్జున్‌తో తెరకెక్కించారట. ఇక ఈ సినిమాకు విజయ్ వద్దనుకోవడానికి గల కారణాన్ని ఇటీవల రివీల్ చేశారు శంకర్.

ఈ కథను రాసుకున్న శంకర్, మొదట విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్ దగ్గరకి తీసుకెళ్లారట. విజయ్‌తో ఈ సినిమాను తీయాలనుకుంటున్నానని చెప్పారట. అయితే అప్పట్లో విజయ్‌ మరిన్ని ప్రాజెక్ట్‌లను ఒప్పుకోవడం, డేట్లు క్లాష్ అవుతుంటడంతో ఈ బ్లాక్‌బస్టర్‌ని వదులుకోవల్సి వచ్చిందట. ఇక ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో నన్బన్‌( 3 ఇడియట్స్ రీమేక్‌. తెలుగులో స్నేహితుడు) తెరకెక్కగా.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం అయ్యింది. ఇక ఇప్పుడు శంకర్, ముదల్వాన్‌కి సీక్వెల్‌కి తెరకెక్కించాలనుకుంటున్నారట. ఈ సీక్వెల్‌ కోసం విజయ్‌ని తీసుకోవాలన్న ఆలోచనలో శంకర్ ఉన్నారట. మరి ఇందులో నిజమెంత..? ముదల్వాన్‌కి సీక్వెల్ తెరకెక్కుతుందా..? విజయ్‌ ఈ సీక్వెల్‌కి ఓకే చెప్తారా..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.

Read More:

15 సెకన్లలోనే కరోనా వైరస్ అంతం

Flash News: నాగబాబుకి కరోనా పాజిటివ్‌

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu