Ram Gopal Varma: మహేష్ చేసిన వ్యాఖ్యలు నాకూ అర్థం కాలేవు.. బాలీవుడ్ గురించి వర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ram Gopal Varma: ప్రస్తుతం ఇండస్ట్రీల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. ఒక భాషకు చెందిన స్టార్‌లు మరో భాష సినిమాల్లో నటించడం సర్వసాధారణమైన విషయం. ఆ మాటకొస్తే పాన్ ఇండియా చిత్రాలతో పేరుతో దక్షిణాదిన విడుదలైన చిత్రాల్లో...
Ram Gopal Varma: ప్రస్తుతం ఇండస్ట్రీల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. ఒక భాషకు చెందిన స్టార్‌లు మరో భాష సినిమాల్లో నటించడం సర్వసాధారణమైన విషయం. ఆ మాటకొస్తే పాన్ ఇండియా చిత్రాలతో పేరుతో దక్షిణాదిన విడుదలైన చిత్రాల్లో ఉత్తరాదిలోనూ దుమ్మురేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌత్ ఇండియాకు చెందిన ప్రతీ స్టార్ హీరోకు ఇప్పుడు పాన్ ఇండియాకు సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు కూడా ఇలాంటి ఓ ప్రశ్నే ఎదురైంది. అయితే ఆ సందర్భంగా మహేశ్ ఇచ్చిన సమాధానం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
ఇటీవల అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘మేజర్’ నినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా హాజరమైన మహేష్.. హిందీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ.. బాలీవుడ్ తనను భరించలేదంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై బాలీవుడ్ ప్రముఖులు సైతం స్పందించారు. అయితే మహేష్ వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారంటూ మహేష్ టీమ్ క్లారిటీ కూడా ఇచ్చినప్పటికీ, బాలీవుడ్‌లో చర్చ మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇదే విషయమై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ విషయమై వర్మ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్ అనేది ఒక సంస్థ కాదు. ఎక్కడ సినిమాలు చేయాలి? ఎలాంటి కథల్లో నటించాలనేది. ఒక నటుడి సొంత నిర్ణయం. దానిని తప్పుపట్టడానికి లేదు. కానీ, తనని బాలీవుడ్ భరించలేదంటూ మహేశ్ చేసిన వ్యాఖ్యల్లో అర్థమేమిటో నాకు తెలియడం లేదు. ఇక బాలీవుడ్ అనేది కేవలం ఒక కంపెనీ కాదు. మీడియా వాళ్లే పేరును ఖరారు చేశారు. నిర్మాత, ప్రొడెక్షన్ కంపెనీ మాత్రమే తమ చిత్రాల్లో నటించమని కోరుతూ నటీనటులకు డబ్బులు ఇస్తుంటారు. అలాంటప్పుడు బాలీవుడ్ మొత్తాన్ని జనరలైజ్ చేసి ఎలా చెబుతాం. అది నాకు అర్థం కావడం లేదు’ అని స్పందించారు. ఇదిలా ఉంటే మహేష్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం బాలీవుడ్ ప్రముఖులు ఇంకా స్పందిస్తూనే ఉన్నారు. మరి ఈ చర్చ ఎక్కడితో ఆగుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..