AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట థియేటర్‌లో ప్రేక్షకుల ఆందోళన.. టికెట్‌ డబ్బులు వాపస్‌ చేసిన యాజమాన్యం

తమ ఫేవరెట్‌ హీరో మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట విడుదల కావడంతో నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీ రామ థియేటర్‌ వద్ద ఫ్యాన్స్‌ హంగామా సృష్టించారు. సినిమాను ప్రదర్శిస్తుండగా థియేటర్ లో..

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట థియేటర్‌లో ప్రేక్షకుల ఆందోళన.. టికెట్‌ డబ్బులు వాపస్‌ చేసిన యాజమాన్యం
Sarkaru Vari Pata
Jyothi Gadda
|

Updated on: May 12, 2022 | 5:41 PM

Share

“స‌ర్కారు వారి పాట’సినిమా రిలీజ్ అయి ప్రేక్షకుల్లో పాజిటీవ్ టాక్ ని తెచ్చుకుంటోంది. మూవీపై, మ‌హేశ్ బాబు న‌ట‌న‌పై ప్రశంసల జ‌ల్లు కురిపిస్తున్నారు జనం..దాదాపు రెండేళ్ల గ్యాప్‌ తర్వాత తమ అభిమాన హీరో నుంచి సినిమా రావడంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ థియేటర్స్‌ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సర్కారు వారి పాట మారుమోగుతోంది. పలు థియేటర్స్‌లో ఫ్యాన్స్‌ సందడి మామూలుగా లేదు. ఇదిలా ఉంటే, నంద్యాల జిల్లా డోన్‌ పట్టణంలో మహేష్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. తమ ఫేవరెట్‌ హీరో మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట విడుదల కావడంతో నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని శ్రీ రామ థియేటర్‌ వద్ద ఫ్యాన్స్‌ హంగామా సృష్టించారు. సినిమాను ప్రదర్శిస్తుండగా థియేటర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో సినిమా ప్రదర్శన సరిగా రాకపోగా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహనికి గురయ్యారు. దాంతో థియేటర్‌ ఎదుట ఆందోళనకు దిగారు. సినిమా ప్రదర్శనకు థియేటర్ యాజమాన్యం ప్రయత్నించినప్పటికీ సాంకేతిక లోపం కారణంగా సినిమాను ప్రదర్శించలేకపోయారు. ప్రేక్షకులు తమ డబ్బులు తమకు తిరిగివ్వాలని ఆందోళనకు దిగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ప్రేక్షకులకు టికెట్ డబ్బులను తిరిగి ఇప్పించడంతో వారంతా ఆందోళన విరమించారు.

పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తిసురేష్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. ఇక, సర్కారు వారి పాట అసలు కథ విషయానికి వస్తే..ఈ సినిమాలో కథానాయకుడు మహేష్‌బాబు అమెరికాలో ఫైనాన్స్‌ కంపెనీ ఏర్పాటు చేసుకొని వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. మరోవైపు అమెరికాలో కాసినోలు, పబ్బుల చుట్టూ తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంది కథానాయిక కళావతి (హీరోయిన్‌ కీర్తి సురేష్‌..) ఆమెను తొలిచూపులోనే ప్రేమిస్తాడు హీరో మహేష్‌. గ్యాంబ్లింగ్‌ అలవాటున్న కళావతి అందుకోసం మహేష్‌ దగ్గర అప్పు తీసుకుంటుంది. ఆ తర్వాత తీర్చనని మొండికేస్తుంది. కళావతి నిజ స్వరూపాన్ని తెలుసుకున్న మహేష్‌.. ఎలాగైనా అప్పు తీర్చాలని పట్టుబడతాడు. ఇచ్చిన అప్పు తీర్చుకోవటానికి మహేష్‌ ఏం చేస్తాడు..? హీరోయిన్‌ తల్లిదండ్రుల కథాంశం ఏంటీ..? చిన్నతనంలో మహేష్‌ తన అమ్మానాన్నల్ని ఎలా కోల్పోయాడు? ఇండియాకొచ్చిన మహేష్‌ తన ఆశయాన్ని నెరవేర్చుకున్నాడా? అన్నదే ఈ సర్కారు వారి పాట సారాంశం.

మొత్తానికి, చాలా గ్యాప్‌ తీసుకున్నప్పటికీ పోకిరి సినిమా తర్వాత మహేష్ మళ్ళీ ఆ రేంజ్ మాస్ యాక్షన్ ఎంటటైనర్ తో అభిమానుల ముందుకు రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Cyclone Asani : అసని పంజాతో రైతుగుండె చెరువు.. ఉప్పు మొదలు పప్పు, బియ్యం వరకు ఊడ్చేసింది..

Hyderabad News: కొడుకు కోసం పోరాటం..రెండు నెలల పసిగుడ్డును వదిలించుకున్న తల్లి, 14ఏళ్లుగా పెంచిన అమ్మ..