AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: ఆ హీరోయిన్ వల్లే నాకు ఆ హీరోకు గొడవ అయ్యింది.. కారణం ఇదే.. డైరెక్టర్..

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనదైన శైలి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలతో పాటు తన మాటలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, తన కెరీర్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇండస్ట్రీలో వివిధ సమయాల్లో తలెత్తిన వివాదాలు, నటులతో ఉన్న సాన్నిహిత్యం, తన దర్శకత్వ శైలి వెనుక ఉన్న అసలు నిజాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

Krishna Vamsi: ఆ హీరోయిన్ వల్లే నాకు ఆ హీరోకు గొడవ అయ్యింది.. కారణం ఇదే.. డైరెక్టర్..
Krishnavamsi
Rajitha Chanti
|

Updated on: Nov 13, 2026 | 1:52 PM

Share

దర్శకుడు కృష్ణవంశీ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జెడి చక్రవర్తి, మహేశ్వరిల మధ్య జరిగిన వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదంపై గతంలో తాను పూర్తిస్థాయిలో సమాధానం ఇవ్వలేదని అంగీకరిస్తూ, “అప్పుడు మాకు పరిణితి లేదు. అది ఓ అతి ఉత్సాహం. నేను ముందే చెప్పినట్లు, అతి సున్నితత్వం వల్ల అలా జరిగింది. మా ఇద్దరికీ అది మొదటి సినిమా. అంతా మనదే అనుకోవడం అలాంటి స్థితి. అంతే తప్ప ఇంకేమీ లేదు” అని వివరించారు. ప్రస్తుతం తామంతా మంచి స్నేహితులమని, హృదయపూర్వకంగా మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. ఆ సమయంలో అది ఒక వైరుధ్యంగా జరిగిందని పేర్కొన్నారు.

రమ్యకృష్ణతో తన ప్రేమ ప్రయాణం గురించి కృష్ణవంశీ వివరంగా తెలియజేశారు. గులాబీ సినిమాలోని పాటలను టీవీలో చూసిన రమ్యకృష్ణ, ముఖ్యంగా బైక్ పాటను ఎంతో మెచ్చుకున్నారని చెప్పారు. ఆ సమయంలో రమ్యకృష్ణ అప్పటికే పెద్ద స్టార్ అని, ఆమెకు అభిమానిగా తాను ఉన్నానని తెలిపారు. నిన్నే పెళ్లాడతా సినిమాకు నటీనటుల ఎంపిక జరుగుతున్నప్పుడు లక్ష్మి గారు రమ్యకృష్ణ గురించి మాట్లాడగా, ఆమె షూటింగ్ సెట్‌లో ఉన్నారని తెలియడంతో అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. రమ్యకృష్ణను కలవగా, ఆమె గులాబీ పాటలను ప్రశంసించారని, తన సినిమా చూశారా అని అడిగారని గుర్తుచేసుకున్నారు. అప్పటికి టీవీలో పాటలు మాత్రమే చూసిన తాను, అదే రోజు రాత్రి సినిమాను ఏర్పాటు చేసి రమ్యకృష్ణతో కలిసి చూసినట్లు తెలిపారు. అక్కడి నుంచే తమ ప్రయాణం మొదలైందన్నారు.

ఆ రోజుల్లో ఫోన్లు పెద్దగా లేకపోవడంతో పేజర్స్ ద్వారా సంభాషణలు మొదలయ్యాయని, ఆ తర్వాత తాను రమ్యకృష్ణ షూటింగ్‌లకు వెళ్లి కలిసేవాడినని చెప్పారు. తమకంటూ ఒక స్నేహితుల బృందం ఉండేదని, వారందరితో కలిసి రాత్రిపూట డాబాలకు వెళ్లేవారమని గుర్తుచేసుకున్నారు. తమ ప్రేమను ఇద్దరూ ఒకరికొకరు వ్యక్తపరచుకోలేదని, “ఇట్ జస్ట్ హాపెండ్” అని అన్నారు. “నేను సినిమాల్లో కూడా దీన్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. నా సినిమాల్లో ఎప్పుడూ ఐ లవ్ యూ అని చెప్పరు. అది ఒక కదలికలో జరిగిపోతుంది. చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు” అని తెలిపారు. సుమారు పదిహేను రోజులు లేదా ఒక నెల తర్వాత తమ మధ్య ఏదో ఉందని ఇద్దరూ గ్రహించినట్లు పేర్కొన్నారు. నిన్నే పెళ్లాడతా సమయంలో తమ బంధం ప్రారంభమై, సింధూరం నాటికి అది ప్రేమ అని అర్థమైందని, చంద్రలేఖ సమయానికి తాము ప్రేమలో ఉన్నామని అన్నారు.

Follow Us