AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Gunasekhar : ఆ సినిమా 100 రోజులు ఆడుతుందని అస్సలు ఊహించలేదు.. డైరెక్టర్ గుణశేఖర్..

దర్శకుడు గుణశేఖర్ తన సినీ ప్రయాణంలో చూడాలని ఉంది వంటి విజయవంతమైన చిత్రాల అనుభవాలను, తన రాబోయే చిత్రం యూఫోరియా నేపథ్యాన్ని ప్రమోషన్లలో పంచుకున్నారు. చూడాలని ఉంది 175 రోజుల వేడుకలో చిరంజీవి పక్కన కూర్చున్న క్షణం తనకు ఒక యూఫోరిక్ మూమెంట్ అని, ఆ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదని తెలిపారు.

Director Gunasekhar : ఆ సినిమా 100 రోజులు ఆడుతుందని అస్సలు ఊహించలేదు.. డైరెక్టర్ గుణశేఖర్..
Gunasekhar
Rajitha Chanti
|

Updated on: Jan 29, 2026 | 1:25 AM

Share

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఒక్కడు, రుద్రమదేవి, శాకుంతలం వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం యుఫోరియా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సారా అర్జున్, భూమిక నటిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా గుణశేఖర్ మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం గురించి, ముఖ్యంగా చూడాలని ఉంది సినిమా విజయం, రాబోయే చిత్రం యూఫోరియా సామాజిక ప్రాధాన్యత గురించి ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. గుణశేఖర్ తన కెరీర్‌లో అత్యంత యూఫోరిక్ మూమెంట్‌ను చూడాలని ఉంది సినిమా 100 రోజుల వేడుకగా గుర్తుచేసుకున్నారు. ఆ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి పక్కన కూర్చున్నప్పుడు, 175 రోజులు ఆడి బ్లాక్‌బస్టర్ అయిన ఆ సినిమాకు తానే దర్శకుడిని అని నమ్మలేకపోయానని అన్నారు. చిన్నపిల్లలతో రామాయణం తీసిన వెంటనే చిరంజీవి తన కథ విని ఇంప్రెస్ అయ్యి సినిమా చేద్దామనడమే ఒక నమ్మలేని నిజమని, ఆ వేడుకలో ఆ నిజం అయినట్టుగా అనిపించిందని తెలిపారు.

తన కొత్త చిత్రం యూఫోరియా సమాజానికి ఇప్పుడు అత్యంత అవసరమైన కథ అని గుణశేఖర్ చెప్పారు. ఈ కథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబడిందని, వార్తాపత్రికలలో చూసిన దారుణమైన సంఘటనలు తనను ఈ కథ రాయడానికి ప్రేరేపించాయని వివరించారు. యువత గంజాయి వంటి వ్యసనాలకు అలవాటుపడి తల్లిదండ్రులను బాధపెడుతున్న సంఘటనలను ఉటంకిస్తూ, యూఫోరియా చిత్రం పేరెంటింగ్, అడోలెసెన్స్ (13 నుండి 19 సంవత్సరాల వయస్సు) దశలో పిల్లల వ్యక్తిత్వ నిర్మాణం ప్రాముఖ్యతను తెలియజేస్తుందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో తోపు యాక్టర్.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలిస్తే..

తన గత చిత్రం ఒక్కడులో యువకుడు అజయ్ పాత్ర బాధ్యతాయుతంగా, సామాజిక స్పృహతో ఎలా నడుచుకుందో గుర్తుచేస్తూ, యూఫోరియాలోని యువకులు సరైన పెంపకం లేకపోవడం వల్ల ఎలా దారితప్పారో చూపిస్తారని గుణశేఖర్ వివరించారు. ఒక్కడులో అజయ్ లాగా, తప్పుదోవ పడితే యూఫోరియాలో చూపించినట్లు స్పాయిల్డ్ కిడ్స్‌గా తయారవుతారని గుణశేఖర్ అన్నారు. దర్శకుడిగా లేదా కథకుడిగా ఇప్పటివరకు పూర్తి సంతృప్తి చెందలేదని, తన బెస్ట్ ఫిలిం ఎప్పుడూ తన రాబోయే తదుపరి చిత్రమేనని గుణశేఖర్ తన నిరంతర అన్వేషణను వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu : సినిమా సూపర్ హిట్టు.. అయినా రెమ్యునరేషన్ వద్దన్న మహేష్.. కారణం ఇదే..