ఏంటీ..! ఈవిడ ప్రేమదేశం హీరో అక్క..!! తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఆమె
90ల దశాబ్దంలో తెలుగు సినిమా యువతను మంత్రముగ్ధులను చేసిన సినిమా ‘ప్రేమదేశం’! ఈ రొమాంటిక్ డ్రామాలో హీరోగా మెరిసిన నటీనటులు ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారిపోయారు. వినీత్, అబ్బాస్ హీరోలుగా, టబూ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఆ రోజుల్లో ఓ సెన్సేషన్.

అప్పట్లో అమ్మాయిల డ్రీమ్ బాయ్ ఈ హీరో.. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే వినీత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు కానీ ఆశించిన స్థాయిలో క్రేజ్ తెచ్చుకోలేకపోయాడు. ప్రేమదేశం సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో వినీత్. తమిళ్ లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అతని హెయిర్ స్టైల్ అయితే యూత్ ను తెగ ఆకట్టుకుంది. ప్రేమదేశం మూవీ తర్వాత కూడా పలు సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు ఈ అందగాడికి.. దాంతో సహాయ నటుడిగా మారి నటించి మెప్పించాడే వినీత్. జెంటిల్ మెన్, సరిగమలు, W/oవి. వర ప్రసాద్, నీ ప్రేమకై, రుక్మిణి, లాహిరి లాహిరి లాహిరిలో, చంద్రముఖి తదితర చిత్రాలు వినీత్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఆతర్వాత వినీత్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు.
ఏంది భయ్యా ఈ సిరీస్ ఇలా ఉంది..! పచ్చి బూతులు, బోల్డ్ సీన్స్.. ఒంటరిగా చూడాల్సిందే
అయితే గతంలోలా ఇప్పుడు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు వినీత్. అప్పుడప్పుడు మాత్రమే సహాయక నటుడి పాత్రల్లో సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తున్నాడు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, వెబ్ సిరీస్ ల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు వినీత్. సినిమాలతో పాటు అప్పుడప్పుడు డ్యాన్స్ కచేరీల్లో కనిపిస్తుంటాడు వినీత్. ఆయనకు క్లాసికల్ డ్యాన్స్ లో మంచి ప్రావీణ్యముంది. ఇదిలా ఉంటే వినీత్ అక్క సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా.? అవును ఆయన అక్క తెలుగులో తిరుగులేని హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.
అతను కమెడియన్ కాదు దేవుడు..! సాయం చేయమని కోరితే.. 3 నెలలకు సరిపడా సరుకులు ఇచ్చాడు..
ఆమె మరెవరో కాదు సీనియర్ నటి శోభన. 90వ దశకంలో ఆమెకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సుమారు 230 కు పైగా సినిమాల్లో నటించిందీ అందాల తార. కేవలం హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, డ్యాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఇలా చాలా విభాగాల్లో సత్తా చాటి మల్టీ ట్యాలెంటెడ్ వుమన్ అనిపించుకుంది. తన నటనా ప్రతిభకు ప్రతీకగా పలు పురస్కారాలు కూడా అందుకుంది. చాలా కాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శోభన ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. దాదాపు 18 ఏళ్లు గ్యాప్ తీసుకున్న శోభన గతేడాది సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేసింది. ఆమధ్య ప్రభాస్‌తో కలిసి కల్కీ2898AD సినిమాలో నటించింది. అలాగే తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తున్నారు ఆమె. కాగా శోభన వినీత్ కు కజిన్ సిస్టర్ అవుతున్నారు.
ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఒక్కసారైనా కలవాలి..! మనసులో మాట బయటపెట్టిన బ్యూటీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




