AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను రాసింది ఒకటి.. తీసింది ఒకటి.. మీరు చూసింది ఇంకొకటి..! టాక్సిక్ డైరెక్టర్ వీడియో వైరల్

కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయాడు కన్నడ సూపర్ స్టార్ యశ్. మరీ ముఖ్యంగా రాకీ భాయ్ గా తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైపోయాడు యశ్. అయితే కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల కంటే ముందే కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు

నేను రాసింది ఒకటి.. తీసింది ఒకటి.. మీరు చూసింది ఇంకొకటి..! టాక్సిక్ డైరెక్టర్ వీడియో వైరల్
Toxic
Rajeev Rayala
|

Updated on: Aug 27, 2026 | 7:10 AM

Share

డ్యాడీ ఈజ్ హోమ్.. అంటూ టాక్సిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పోస్టర్స్, సాంగ్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ అంటూ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదేంటీ మనం అనుకున్నది ఇది కాదే.. సినిమా ఇలా ఉందేంటి అంటూ సినిమా చూసొస్తున్న ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా కావడంతో ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఫైట్లు, యాక్షన్స్ సీన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. కానీ సినిమా ఎక్కడో తేడా కొట్టిందే అంటున్నారు ఆడియన్స్.

సినిమా డివైడ్ టాక్ వస్తున్న నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నేను రాసింది ఒకటి, తీసింది మరొకటి, ఎడిటింగ్ చేసింది ఇంకొకటి..మొత్తానికి సినిమా బయటకు వచ్చింది. నేను చాలా హ్యాపీ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదు పాతది అని కొందరు అంటున్నారు. మరికొందరు ఓహో డైరెక్టర్ కు క్లారిటీ ఉందన్నమాట అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇక టాక్ సినిమా తొలి రోజే దేశవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సినిమాకు ముందు నుంచి భారీ హైప్ ఉండటంతో బుకింగ్స్ బాగానే జరిగింది. దాంతో ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే రాబట్టింది ఈ సినిమా. ‘టాక్సిక్‌’ రిలీజ్ 16 లక్షల టికెట్స్ సేల్ అయ్యాయి. దాంతో మొదటి రోజు సినిమాకు కలెక్షన్స్ వర్షం కురిపించింది. . టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు అలవోకగా రూ.100 – 120 కోట్ల వరకూ కలెక్షన్స్ సాధించవచ్చని  అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us