Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: స్టార్ హీరోకి నో చెప్పిన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కారణం ఇదేనా..?

యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ భామ. ఇప్పటికే ఈ అమ్మడు చేతిలో పదుల సంఖ్యలో ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

Sreeleela: స్టార్ హీరోకి నో చెప్పిన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కారణం ఇదేనా..?
Sreeleela
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 27, 2023 | 5:39 PM

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న బ్యూటీస్ లో శ్రీలీల ఒకరు. ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ వరస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ భామ. ఇప్పటికే ఈ అమ్మడు చేతిలో పదుల సంఖ్యలో ఆఫర్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ భామ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. పూజ హెగ్డే ఈ సినిమానుంచి తప్పుకోవడమతో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తుంది శ్రీలీల.

వీటితోపాటే నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు ఓ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే నో చెప్పిందట.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో ఉన్నాడు. పుష్ప సినిమాలోలానే పుష్ప 2 లో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఈసాంగ్ కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పేర్లు పరిశీలించారు. బాలీవుడ్ భామలను కూడా సంప్రదించారట.. చివరకు ఈ ఆఫర్ శ్రీలీల దగ్గరకు వచ్చిందట. అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఆఫర్ కు నో చెప్పిందట. డేట్స్ కారణంగా శ్రీలీల నో చెప్పిందని టాక్ వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.