Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Leopard: అమ్మబాబోయ్.. షూటింగ్‌కు వచ్చిన అనుకోని అతిథి.. పరుగందుకున్న యూనిట్..

తాజాగా ఓ సీరియల్ షూటింగ్ కు ఊహించని అతిథి వచ్చింది. అతిథి వస్తే అందరూ వెల్ కామ్ చెప్తారు.. కానీ ఇక్కడ మాత్రం  ఎక్కడికక్కడ దాక్కోవడం.. ఎగేసుకొని పరిగెత్తడం చేశారు.

Leopard: అమ్మబాబోయ్.. షూటింగ్‌కు వచ్చిన అనుకోని అతిథి.. పరుగందుకున్న యూనిట్..
Leopard
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 27, 2023 | 5:16 PM

సినిమా షూటింగ్స్ జరుగుతున్న సమయంలో ఇతర మూవీ హీరోలు విజిట్ చేయడం మనం చూస్తుంటాం.. స్టార్ హీరోలు తమ షూటింగ్స్ కు వచ్చిన సమయంలో ఆ ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక సీరియల్స్ విషయం గురించి తెలిసిందే.. సంవత్సరాల తరబడి సాగుతుంటాయి ఈ సీరియల్స్. తాజాగా ఓ సీరియల్ షూటింగ్ కు ఊహించని అతిథి వచ్చింది. అతిథి వస్తే అందరూ వెల్ కామ్ చెప్తారు.. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడికక్కడ దాక్కోవడం.. ఎగేసుకొని పరిగెత్తడం చేశారు. ఇంతకు షూటింగ్ సెట్ కు వచ్చిన ఆ గెస్ట్ ఎవరు అంటే..

అసలే వర్షాకాలం.. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు రోడ్లన్నీ వరద నీటితో నిండిపోతున్నాయి. అలాగే జనావాసం అంతా అస్తవ్యస్తంగా మారిపోయాయి. దాంతో ఇండ్లలోకి పాములు, చేపలు లాంటి ఇళ్లల్లోకి షూటింగ్ స్పాట్స్ లోకి వస్తుంటాయి.

కానీ ఇక్కడ ఓ సీరియల్ షూటింగ్ కు ఏకంగా ఓ చిరుత పులి వచ్చింది. చిరుతను చూసిన అక్కడి వారు పరోగో పరుగు అంటూ పరిగెత్తారు. ముంబై లోని అజుని సీరియల్ ను షూట్ చేస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కు చిరుత రావడంతో అందరు షాక్ కు గురయ్యారు. గత 10 రోజుల్లో చిరుతలు సెట్ లోకి రావడం ఇది నాలుగోసారి అని అక్కడి వారు తెలుపుతున్నారు.