సుశాంత్‌ని అలా అనుకునేవాళ్లు తెలివిలేని వాళ్లు.. డెన్మార్క్‌ సింగర్ కీలక విషయాలు

| Edited By:

Sep 12, 2020 | 1:29 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు మిస్టరీ సినిమాను తలపిస్తోంది. సుశాంత్‌కి డ్రగ్స్‌ అలవాటు ఉందని, డిప్రెషన్‌తో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడని

సుశాంత్‌ని అలా అనుకునేవాళ్లు తెలివిలేని వాళ్లు.. డెన్మార్క్‌ సింగర్ కీలక విషయాలు
Follow us on

Sushant Case updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసు మిస్టరీ సినిమాను తలపిస్తోంది. సుశాంత్‌కి డ్రగ్స్‌ అలవాటు ఉందని, డిప్రెషన్‌తో బాధపడుతూ ఆత్మహత్య చేసుకున్నాడని ఓ వర్గం చెబుతుంటే.. మరోవైపు సుశాంత్‌ని హత్య చేశారంటూ మరో వర్గం ఆరోపణలు చేస్తోంది. పక్కా ప్రణాళికతో సుశాంత్‌ని చంపేసి, ఆత్మహత్యగా చిత్రీకరించి ఇప్పుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ సుశాంత్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దేశంలోని పేదలకు సాయం చేసేలా సుశాంత్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌తో యాప్‌లు తయారు చేశాడని వాటి కోసమే అతడిని చంపేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించి తనతో సుశాంత్‌ మాట్లాడినట్లు డెన్మార్క్‌కి చెందిన ప్రముఖ సింగర్‌ ఏరియన్ రోమల్‌ ఓ వెబ్‌సైట్‌కి తెలిపారు. అలాగే ఓ ట్వీట్‌ చేసిన ఏరియన్‌, సుశాంత్ ఎలాంటి వాడో చెప్పుకొచ్చారు

”నేను ఆరోగ్యంగా ఉన్నా. నా గురించి ఆరా తీసిన అందరికీ థ్యాంక్స్‌. సినిమా ఇండస్ట్రీలో నేను మాట్లాడిన చాలా మందిలో సుశాంత్‌ చాలా ఇంటిలిజెంట్ వ్యక్తి. అతడు బైపోలార్‌, డ్రగ్ అడిక్ట్ కాదు. ఆ పేర్లను అతడిని పిలవడం మానండి. ఆయన ఆత్మకు శాంతిని కలగనివ్వండి. క్వాంటమ్ ఫిజిక్స్‌, ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్‌, బ్యాకెండ్ డెవలప్‌మెంట్ గురించి నాతో చర్చించిన ఓ వ్యక్తిని.. వాటిపై కనీస అవగాహన లేని కొంతమంది ‘డిప్రెషన్‌’ పేరుతో పిలుస్తున్నారు. ఇప్పటికీ అతడిని డిప్రెషన్‌ అని పిలిచే వారిని తెలివితేటలు పెద్దగా లేవని అనుకుంటున్నా” అని ఏరియన్ రాసుకొచ్చారు.

Read More:

నటి తెలివితేటలు.. ‘డ్రగ్’ టెస్ట్‌లో దొరక్కుండా ‘యూరిన్’‌లో నీళ్లు

డ్రగ్స్ కేసు.. 25 మంది పేర్లు బయటపెట్టిన రియా..!