నూతన దంపతులకు వానరం ఆశీర్వాదం !

పెళ్లంటే నూరేళ్ల పంట..దంపతులు ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండాలని పెళ్లికి వచ్చిన పెద్దలు దీవిస్తారు.. విచిత్రామేమో కానీ ఇక్కడ ఈ పెళ్లిలో మాత్రం వానరాలు అశ్వీరదీంచాయి. కరోనా కారణంగా ఓ కల్యాణానికి కోతులే అతిథులయ్యాయి.

నూతన దంపతులకు వానరం ఆశీర్వాదం !
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 12, 2020 | 12:19 PM

పెళ్లంటే నూరేళ్ల పంట..దంపతులు ఇద్దరు కలకాలం సంతోషంగా ఉండాలని పెళ్లికి వచ్చిన పెద్దలు దీవిస్తారు..విచిత్రామేమో కానీ ఇక్కడ ఈ పెళ్లిలో మాత్రం వానరాలు అశ్వీరదీంచాయి. కరోనా కారణంగా ఓ కల్యాణానికి కోతులే అతిథులయ్యాయి. ఐనవాళ్లంతా ఆ కల్యాణ వేడుకకు హాజరు కాలేకపోయినప్పటికీ వానరసేనలు అతిధులుగా హాజరై అక్షింతలు పడే సమయంలో వధూవరులను ఆశీర్వదించాయి.

ఈ విచిత్ర సంఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలోని శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో జరిగింది. వాజేడు మండలం గుమ్మడి దొడ్డి గ్రామానికి చెందిన బోదెబోయిన భరత్ కుమార్- నాగమణి వధువరుల వివాహం ఈ ఆలయంలో జరిగింది. ఈ వివాహ వేడుకను వారి స్థాయికి తగట్లు వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలని అనుకున్నప్పటికీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండు సార్లు వివాహం వాయిదా పడింది. ఎట్టకేలకు ఇరు కుటుంబాల పెద్దలు శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో నిరాడంబరంగా కల్యాణం జరిపించారు.

కుటుంబ సభ్యులు, బంధువులు అంతాకలిసి ఓ 20 మంది సమక్షంలో పెళ్లి వేడుక ముగిసింది. అయితే అనూహ్యంగా ఈ పెళ్లి వేడుకలో ఒక వానరం హల్ చల్ చేసింది. అతిథులు అందరితో కూర్చుని మాటా ముచ్చట కలిపిన ఆ వానరం అక్షింతలు పడే సమయంలో అందరిని ఆశ్చర్య పరిచింది. అందరూ ఏం జరిగిందో తేరుకునేలోపే వానరం వధూవరుల తల పైకి ఎక్కి వారిని ఆశీర్వదించి, అక్కడి నుంచి వెళ్లిపోయింది.

దీంతో అతిధులు లేని ఈ పెళ్లి వేడుకలో ఈ వానరము దీవెనే అభయాంజనేయ స్వామి ఆశీర్వదించాలని భావించి కుటుంబసభ్యులు, బంధువులు ఆనందంతో మురిసిపోయారు. ఈ పెళ్లి వేడుక లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ సన్నిధిలో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహం ముందు జరగడం, ఈ వానరం ఆశీర్వదించడం విశేషంగా మారింది.