తమిళ్‌లో రీమేక్ అవ్వనున్న ‘దియా’!

ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన చిత్రాల్లో దియా ఒకటి. ట్రాజెడిక్‌ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది

తమిళ్‌లో రీమేక్ అవ్వనున్న 'దియా'!
Follow us

| Edited By:

Updated on: Sep 12, 2020 | 2:09 PM

Dia movie remake: ఈ ఏడాది విడుదలై మంచి విజయాన్ని సాధించిన చిత్రాల్లో దియా ఒకటి. ట్రాజెడిక్‌ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంది. అంతేకాదు ఆ తరువాత ఓటీటీలో దియా విడుదల కాగా.. అక్కడ ఈ చిత్రానికి మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉంటే ఈ మూవీని పలు భాషల్లో రీమేక్ చేసేందుకు తమను పలువురు సంప్రదించారంటూ ఆ మధ్యన నిర్మాత కృష్ణ చైతన్య వెల్లడించగా.. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే దియా తమిళ్‌లో రీమేక్‌ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

దీనికి సంబంధించి ఇప్పటికే రీమేక్ హక్కులు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. కుదిరై వాల్‌(విడుదలకు సిద్ధంగా ఉంది) అనే చిత్రాన్ని తెరకెక్కించిన మనోజ్ లెనోల్‌ జాన్సన్‌ దియా రీమేక్‌కి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా తెలుగులోనూ దియాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Read More:

కరోనా అప్‌డేట్స్‌: రష్యాకు చేరువలో మహారాష్ట్ర

సుశాంత్‌ని అలా అనుకునేవాళ్లు తెలివిలేని వాళ్లు.. డెన్మార్క్‌ సింగర్ కీలక విషయాలు