Breaking News
  • రాజ్యసభ లో రైతు, వ్యవసాయ సంబంధ బిల్లుల చర్చ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు దారుణంగా వ్యవహరించాయి. ప్రతిపక్ష చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చట్టంతో రైతులకు నిజమైన స్వాతంత్య్రం వచ్చింది. దేశంలో ఎక్కడైనా, మంచి ధర లభించిన చోట అమ్ముకునే వెసులుబాటు ఈ చట్టంతో రైతులకు కల్పించాం. మార్కెట్లు యధావిధిగా ఉంటాయి. రాజ్యసభ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, కమ్యూనిస్టు ఎంపీలు గుండాల్లా ప్రవర్తించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించారు, వారిపై చర్యలు తీసుకోవాలని చైర్మన్ కు పిర్యాదు చేస్తాం. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడు మాత్రం వ్యతిరేకించడం వారి రాజకీయ అవకాశవాదానికి నిదర్శనం. కాంగ్రెస్, లెఫ్ట్, తృణమూల్ పార్టీలు డిప్యూటీ చైర్మన్ కు భేషరతుగా క్షమాపణలు చెప్పాలి. జీవిఎల్.
  • తిరుమల లో విమానం వెళ్లిన మాట వాస్తవమేనని ప్రకటించిన ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్. విమానయాన శాఖ కు చెందిన నావిగేషన్ సర్వే విమానం తిరుమల మీదుగా వెళ్ళింది. అయితే..తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్ళలేదు. ఆలయానికి కొద్దిగా దూరం నుంచి ప్రయాణించింది.. తిరుమల పై విమాన రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేవు. నో ఫ్లై జోన్ గా ప్రకటించలేమని గతంలో కేంద్రం స్పష్టం చేసింది. అయినప్పటికీ అనధికారికంగా తిరుమల నో ఫ్లై జోన్ గా కొనసాగుతోంది...ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్.
  • అమరావతి ట్విటర్ లో పవన్ కళ్యాణ్. అమరావతి రైతుల పక్షాన ఏపీ హైకోర్టు లో అఫిడవేట్ దాఖలు చేయనున్న జనసేన. ఈ బాధ్యతలను జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ తమ్మి రెడ్డి శివశంకర్ కు అప్పగింత.
  • ఏఎన్నార్‌ జయంతి సందర్భంగా ప్రత్యేక వీడియో రిలీజ్‌ చేసిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్. అఖిల్‌ కెరీర్‌లో ఐదో సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్. సురేందర్‌ రెడ్డి డైరక్షన్‌ చేస్తున్న సినిమా ఇది . తాతగారు ఎప్పుడూ దేవుడిని నమ్మే వారు కాదన్న అఖిల్‌. ఆయన అభిమానుల్లో దేవుడిని చూసుకునేవారన్న అఖిల్‌.
  • . భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. . 54 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 1133 మంది మృతి . గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 94,612 • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 54,00,620 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 10,10,824 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 43,03,043 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 86,752 . దేశంలో 79.28 శాతం కరోనా రోగుల రికవరీ రేటు . దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 19.10 శాతం . దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.61 శాతానికి తగ్గిన మరణాల రేటు . దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 12,06,806 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు . దేశంలో ఇప్పటి వరకు 6,36,61,060 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • రెండు వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమైనవి. రైతుల జీవితాల్లో మార్పు తెస్తాయి. రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా అమ్ముకోవచ్. వ్యవసాయ బిల్లులు కనీస మద్దతు ధరతో సంబంధం లేదని రైతులకు భరోసా ఇస్తున్నా. నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర వ్యవసాయ మంత్రి.

డ్రగ్స్ కేసు.. 25 మంది పేర్లు బయటపెట్టిన రియా..!

సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన సినీ నటి రియా ప్రస్తుతం జైల్లో ఉంది. అయితే విచారణలో భాగంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులకు
Drugs Case Bollywood, డ్రగ్స్ కేసు.. 25 మంది పేర్లు బయటపెట్టిన రియా..!

Drugs Case Bollywood: సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలో అరెస్టైన సినీ నటి రియా ప్రస్తుతం జైల్లో ఉంది. అయితే విచారణలో భాగంగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులకు రియా పలు సంచలన విషయాలు బయట పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన దగ్గర డ్రగ్స్ తీసుకునే వారి వివరాలు, కొన్న వారి వివరాలను ఎన్సీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. మొత్తం 25మంది పేర్లను ఆమె బయటపెట్టినట్లు తెలుస్తుండగా.. అందులో దర్శకులు, కాస్టింగ్ డైరెక్టర్లు, నిర్మాణ సంస్థలు, నటీనటులు ఉన్నట్లు టాక్. వారిలో సారా అలీ ఖాన్ పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వీరికి సంబంధించి ప్రస్తుతం విచారణ చేస్తోన్న ఎన్సీబీ అధికారులు.. ఆధారాలు లభిస్తూనే సమన్లు జారీ చేయాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్సీబీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా, డీజీ అస్తానా శుక్రవారం సమావేశమయ్యారు. ఈ కేసుకు సంబంధించి ముందుకు ఎలా వెళ్లాలి..? అన్న విషయంపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

Read More:

‘కరోనా’ పోతేనే ఆ ‘కాటికాపరి’ అలసట తీరుతుంది

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు డ్రెస్‌ కోడ్‌.. వారికి ‘నో’ ఎంట్రీ

Related Tags