ప్రభాస్ పాన్ ఇండియా మూవీపై పెరుగుతున్న హైప్.. కారణం ఆ బాలీవుడ్ హీరోయినేనా..? ఇలా తెలుసుకోండి..

Deepika Different Getup in Prabas Movie : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వైజయంతీ మూవీస్ మేకర్స్ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న

  • uppula Raju
  • Publish Date - 9:09 pm, Fri, 12 March 21
ప్రభాస్ పాన్ ఇండియా మూవీపై పెరుగుతున్న హైప్.. కారణం ఆ బాలీవుడ్ హీరోయినేనా..? ఇలా తెలుసుకోండి..
Deepika Different Getup In

Deepika Different Getup in Prabas Movie : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వైజయంతీ మూవీస్ మేకర్స్ పాన్ ఇండియా మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాలు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కథానాయికగా నటిస్తోంది. దీంతో ఈ సినిమాపై హైప్ మరింతగా పెరిగింది. అయితే ఈ సినిమా జూలైలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం.

ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనె డిఫరెంట్ రోల్ చేస్తుంది. యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో డిఫర్ గెటప్‌లో కనిపించనున్న ఆమె.. ఫ్యూచరిస్టిక్ టైమ్‌లైన్‌లో మనుగడ కోసం పోరాడే పాత్రతో ఆకట్టుకోనుందని తెలుస్తోంది. ఇలాంటి స్టోరీ లైన్‌ను ఇండియన్ సినిమా ఇప్పటి వరకు టచ్ చేయలేదని తెలుస్తుండగా.. దర్శకులు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్‌లు 2023లో చిత్రాన్ని రిలీజ్ చేసే చాన్స్ ఉంది. ఇక దీపికా పదుకొనె ఆలోపు ‘పఠాన్’ షూటింగ్ ముగించుకొని ప్రభాస్ మూవీ కోసం 75 రోజుల పాటు పనిచేయనుందని సమాచారం.

పలు ఇంటర్నేషనల్ టీమ్స్ ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కోసం పనిచేయనుండగా.. 2022లో రిలీజ్ సాధ్యం కాదనే చెప్తున్నారు విశ్లేషకులు. కాగా ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. వివాహమైన తర్వాత సినిమాల్లో నటించడం జోరు పెంచిన ఈ అమ్మడు తన భర్త రణ్ వీర్ సింగ్‌తో కలిసి స్పోర్ట్స్‌ డ్రామాలో నటిస్తోంది. గతేడాది ఆమె నటించిన ‘ఛపాక్‌’ మంచి విజయం సాధించింది. అందులో యాసిడ్‌ బాధితురాలిగా దీపిక నటన అందర్నీ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి.

అంగారకుడిపై శబ్దాలను రికార్డ్ చేసి పంపిన పర్సెవరెన్స్ రోవర్.. ఈ ఆడియో ద్వారా ఆసక్తికర నిజాలు వెల్లడిస్తున్న సైంటిస్టులు
వేసవిలో చెరకు రసంతో సేదతీరండిలా..! ఆరోగ్యపరంగా మహిళలకు చాలా బెన్‌ఫిట్స్.. తెలుసుకోండిలా..

India vs England 1st T20: ముగిసిన టీ20 తొలి ఇన్నింగ్స్… ఇంగ్లండ్ లక్ష్యం 125 పరుగులు..