AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘డియర్ కామ్రేడ్’ విడుదల తేదీలో మార్పు..?

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే అదే రోజున తమిళ హీరో సూర్య నటించిన ‘ఎన్జీకే’ విడుదల కానుంది. సూర్యకు అటు తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో మంచి మార్కెట్ ఉంది. దానితో ‘డియర్ కామ్రేడ్’ ను అదే రోజున రిలీజ్ […]

'డియర్ కామ్రేడ్' విడుదల తేదీలో మార్పు..?
Ravi Kiran
|

Updated on: Mar 27, 2019 | 5:31 PM

Share

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రాన్ని మే 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే అదే రోజున తమిళ హీరో సూర్య నటించిన ‘ఎన్జీకే’ విడుదల కానుంది. సూర్యకు అటు తమిళంతో పాటు తెలుగు, మలయాళం భాషల్లో మంచి మార్కెట్ ఉంది.

దానితో ‘డియర్ కామ్రేడ్’ ను అదే రోజున రిలీజ్ చేస్తే కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశం ఉందని మేకర్స్ ఈ చిత్రాన్ని జూన్ 6న విడుదల చేయాలని భావిస్తున్నారట. కాగా దీనిపై అధికారక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.