AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రాజమౌళి అఫీషియల్ గా మిగిలిన తారాగణం గురించి ప్రకటించాడు. అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడితే అలియా భట్ మనకు సుపరిచితమే. బాలీవుడ్ లో పలు […]

అసలు ఎవరీ డైసీ ఎడ్గర్ జోన్స్..?
Ravi Kiran
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:49 PM

Share

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించే ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రాజమౌళి అఫీషియల్ గా మిగిలిన తారాగణం గురించి ప్రకటించాడు. అలియా భట్, డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, తమిళ నటుడు సముద్రఖని కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఇక హీరోయిన్స్ గురించి మాట్లాడితే అలియా భట్ మనకు సుపరిచితమే. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. రామ్ చరణ్ కు జోడిగా ఆమె ను జక్కన్న ప్రకటించడంతో అందరూ కూడా సంతోషించారు. ఇకపోతే ఎన్టీఆర్ సరసన ప్రకటించిన హీరోయిన్ గురించి మాత్రం అందరికి ఆశ్చర్యం కలిగించింది.

ఆమె ఎవరో కాదు డైసీ ఎడ్గర్ జోన్స్.. ఇంగ్లీష్ లోనే ఈమె పేరు పలకడానికి కొంతమంది కష్టపడతారు. అలాంటిది ఈమెను జక్కన్న ఎంచుకోవడానికి గల కారణాలు వెతుకుతున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. డైసీ గురించి చెప్పాలంటే ఆమె ఒక సుప్రసిద్ధ నేషనల్ యూత్ థియేటర్ లో శిక్షణ తీసుకున్న నటి. ఇందులో నుంచే హెలెన్ మిర్రెన్.. క్యాథరిన్ టేట్ లాంటి నటీనటులు వచ్చారు. మొదట సైలెంట్ విట్ నెస్, అవుట్ నెంబర్డ్ లాంటి షోస్ తో పేరు తెచ్చుకున్న డైసీ. బ్రిటిష్ కామెడీ డ్రామా సిరీస్ కోల్డ్ ఫీట్ తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.

అంతేకాదు గతేడాది రిలీజ్ అయిన ‘పాండ్ లైఫ్’, ‘వార్ అఫ్ ది వరల్డ్ సిరీస్ లలో కూడా నటించి అభిమానుల మనసు దోచుకుంది డైసీ. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి టీనేజ్ యాక్టర్ గా ఎదగడంలో చాలా కష్టపడిన డైసీకి.. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో అవకాశం దక్కడం మంచి విషయం అని విశ్లేషకులు అంచనా. ఇది ఇలా ఉంటే ఆమె బ్రిటిష్ సుందరి కాబట్టి ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర అదే తరహాలో ఉండొచ్చు అని తెలుస్తోంది. భారతీ విప్లవ వీరుడిని ప్రేమించిన ఇంగ్లీష్ సుందరిగా తన పాత్రను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సమాచారం. సో మొన్నటి వరకు టాలీవుడ్ ప్రేక్షకులకు ఎవరో తెలియని డైసీ… ఇంకో రెండేళ్ల వరకు హాట్ టాపిక్ గా నిలవనుంది.

W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించిన విధ్వంసం
W,W,W,W,W,W,W,W.. టీ20 క్రికెట్‌లోనే ఊహించిన విధ్వంసం
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు!
మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలు!
అందంగా లేదు అన్న హీరోయిన్‌తో హిట్ కొట్టిన వంశీ..
అందంగా లేదు అన్న హీరోయిన్‌తో హిట్ కొట్టిన వంశీ..
2026లో హోలీ రోజే చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!
2026లో హోలీ రోజే చంద్రగ్రహణం.. వీరి జీవితంలో ఊహించని సమస్యలు!
యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
యూజీసీ నెట్‌ 2025 అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్‌ లింక్ ఇదే
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభకు కేసీఆర్.. ఆ తర్వాత..
ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!
ఈ ఒక్క సైకాలజీ ట్రిక్‌తో మీ శత్రువులను మిత్రులుగా మార్చుకోండి!
XUV 700లో లేనివి రాబోయే మహీంద్రా XUV 7XOలో అందించే టాప్‌ ఫీచర్స్‌
XUV 700లో లేనివి రాబోయే మహీంద్రా XUV 7XOలో అందించే టాప్‌ ఫీచర్స్‌
రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా.. ఎల్లో అలర్ట్ జారీ!
రాష్ట్రంపై వచ్చే 2 రోజులు చలి పంజా.. ఎల్లో అలర్ట్ జారీ!
తక్కువ పెట్టుబడితో మీ బిజినెస్‌ బ్రాండ్‌ను క్రియేట్‌ చేయొచ్చు!
తక్కువ పెట్టుబడితో మీ బిజినెస్‌ బ్రాండ్‌ను క్రియేట్‌ చేయొచ్చు!