Custody Twitter Review: ‘చైతన్య కెరీర్‌లో బెస్ట్ మూవీ’.. కస్టడీ సినిమాకు ట్విట్టర్‌ రివ్యూలో పాజిటివ్‌ బజ్‌

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. వెంక్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళంలో ఏక కాలంలో నిర్మించడం, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కడం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. ఇక ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా..

Custody Twitter Review: చైతన్య కెరీర్‌లో బెస్ట్ మూవీ.. కస్టడీ సినిమాకు ట్విట్టర్‌ రివ్యూలో పాజిటివ్‌ బజ్‌
Custody Twitter Review

Updated on: May 12, 2023 | 10:24 AM

నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. వెంక్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీగా అంచనాలు ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళంలో ఏక కాలంలో నిర్మించడం, భారీ కాస్టింగ్‌తో తెరకెక్కడం ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. ఇక ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఈరోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్‌ వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతన్న ట్వీట్స్‌ ఆధారంగా నాగ చైతన్య మరో సాలిడ్‌ హిట్‌ను సొంతం చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. చైతన్య కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ మూవీ అవుతుందని, సినిమా చాలా బాగుందని నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఫస్టాఫ్‌లో చాలా బాగుందని, ఇలయరాజా బ్యాగ్రౌండ్‌ అద్భుతంగా ఉందని, నాగ చైతన్య నటన చాలా బాగుందని ఓ నెటిజన్‌ పోస్ట్ చేశారు. ఒక మరో యూజర్‌ స్పందిస్తూ.. ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉన్నా, సెకండాఫ్‌ మాత్రం చాలా బాగుందని, స్క్రీన్‌ప్లే, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సూపర్‌ అంటూ రాసుకొచ్చారు. ఇక మరో యూజర్‌.. ఫస్టాఫ్‌లో పోలీస్‌ స్టేషన్‌లో వచ్చే సన్నివేశం, సెకండాఫ్‌లో వచ్చే ఫారెస్ట్‌ సన్నివేశం చాలా బాగుందని రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

సినిమా చాలా సహజంగా ఉందని, ఈ థ్రిల్లర్‌ మూవీకి ప్రతీ ఒక్కరూ ఎంగేజ్‌ కావడం పక్కా అని మరో యూజర్‌ ట్వీట్ చేశారు. అరవింద్‌ స్వామి నటన కూడా చాలా బాగుందని రాసుకొచ్చారు. ఇక మరో యూజర్‌ స్పందిస్తూ.. మూవీ అద్భుతంగా ఉందంటూ 3.25 రేటింగ్ ఇచ్చాడు. సినిమా ఆసక్తికరమైన కథనంతో వచ్చిన ఈ సినిమా చాలా బాగుందని మరో యూజర్‌ ట్వీట్‌ చేశాడు. కస్టడీ సినిమాలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌, కథ, సినిమాటోగ్రఫీ ప్లస్‌ పాయింట్స్‌ కాగా.. లవ్‌ స్టోరీ, పాటలు, సాగగీత ధోరణిలో ఉన్న సన్నివేశాలు నెగిటివ్‌ పాయింట్స్‌.. అని యూకేకి చెందిన ఓ యూజర్‌ ట్వీట్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..