ఖననాల కోసం స్థలం ఇస్తానన్న స్టార్ హీరో.. పవన్ ప్రశంసలు..!

కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారిని ఖననం చేసేందుకు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది తమ స్థానాల్లో మృతదేహాలను ఖననం చేసేందుకు ఒప్పుకోవడం లేదు.

ఖననాల కోసం స్థలం ఇస్తానన్న స్టార్ హీరో.. పవన్ ప్రశంసలు..!
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 1:30 PM

కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిన వారిని ఖననం చేసేందుకు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలా మంది తమ స్థానాల్లో మృతదేహాలను ఖననం చేసేందుకు ఒప్పుకోవడం లేదు. ఇటీవల తమిళనాడులో ఇలాంటి ఉదంతమే జరిగింది. చెన్నైలో ఓ వైద్యుడు కరోనాతో మృతి చెందగా.. ఆయన మృతదేహాన్ని ఖననం చేయడానికి స్థానికులు వ్యతిరేకించారు. ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇలాంటి ఉదాంతాలపై డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ స్పందించారు. కరోనా మృతుల్ని ఖననం చేయడానికి తన స్థలం ఇస్తానని ఆయన ముందుకొచ్చారు. చెన్నై శివార్లలో విజయ్‌కు చెందిన ఆండాళ్ అళగర్‌ కాలేజీ ఉండగా.. దాని ప్రాంగణంలో ఉన్న కొంత భాగాన్ని కరోనా మృతుల ఖననానికి ఇస్తానని ఆయన ఓ ప్రకటన ఇచ్చారు. కరోనాతో మృతి చెందిన వారిని ఖననం చేస్తే వైరస్ వ్యాప్తి చెందనని.. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు.

ఇక విజయ్‌ చేసిన ఈ ప్రకటనతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘కెప్టెన్‌ యు ఆర్ గ్రేట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు విజయ్‌ ప్రకటనపై పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. కరోనా వైరస్‌తో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేయడానికి స్థానికులు నిరాకరించారు. డీఎంకే నాయకుడు, విజయకాంత్ తన కాలేజీలో కొంత భాగాన్ని కరోనా మృతుల ఖననం కోసం ఇవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం. ఆయన వ్యక్తిత్వం గొప్పది అని ట్వీట్ చేశారు.

Read This Story Also: షాకింగ్.. సీఎం ఇంట్లో పోలీస్‌కు కరోనా పాజిటివ్‌..!