షాకింగ్.. సీఎం ఇంట్లో పోలీస్‌కు కరోనా పాజిటివ్‌..!

దేశవ్యాప్తంగా కరోనా కలకలం పెరుగుతోంది. లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతున్నప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

షాకింగ్.. సీఎం ఇంట్లో పోలీస్‌కు కరోనా పాజిటివ్‌..!
Follow us

| Edited By:

Updated on: Apr 22, 2020 | 11:53 AM

దేశవ్యాప్తంగా కరోనా కలకలం పెరుగుతోంది. లాక్‌డౌన్‌ కఠినంగా అమలవుతున్నప్పటికీ.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో కరోనా కేసుల ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే అధికార నివాసమైన వర్ష బంగళా వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ సోకింది. ఆమెకు పాజిటివ్ ఉన్నట్లు ఆదివారం వచ్చిన రిపోర్టులో తేలింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆరుగురు పోలీస్‌ సిబ్బంది క్వారంటైన్‌కు పంపారు.

ఈ విషయంపై ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి మాట్లాడుతూ.. ఓ మహిళా కానిస్టేబుల్‌కు కరోనా పాజిటివ్ సోకింది. ఆమెను ఆసుపత్రికి తరలించాము. అలాగే ఆమె కాంటాక్ట్ అయిన వారి వివరాలను సేకరిస్తున్నాం అని పేర్కొన్నారు. కాగా ఆ మహిళా కానిస్టేబుల్ ఇటీవలే సీఎం అధికారిక భవనంలో విధులు నిర్వహించేందుకు వెళ్లినట్లు సమాచారం.

Read This Story Also: ప్రపంచవ్యాప్తంగా కరోనా అప్‌డేట్స్‌.. లక్ష పాజిటివ్ కేసులు దాటిన దేశాలివే..!

Latest Articles