Bank Customers Alert: ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. నెల రోజుల్లో ఖాతాలు క్లోజ్‌.. ఎందుకో తెలుసా?

సాధారణంగా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉంటేంది. గతంలో బ్యాంకు అకౌంట్‌ తీయాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. బ్యాంకుకు వెళ్లి పేజీల కొద్ది వివరాలు నమోదు చేసిన తర్వాతే అప్పుడు ఖాతా యాక్టివ్‌ అయ్యేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఫోన్‌ ద్వారా, ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా అకౌంట్‌ తీసుకునే సదుపాయం వచ్చింది. కానీ ఖాతాను సరిగ్గా మెయింటెన్‌ చేస్తే మంచిది. లేకుంటే పెనాల్టీ ఛార్జీలు వేయడం,..

Bank Customers Alert: ఈ బ్యాంకు కస్టమర్లకు షాకింగ్‌ న్యూస్‌.. నెల రోజుల్లో ఖాతాలు క్లోజ్‌.. ఎందుకో తెలుసా?
Bank Account
Follow us
Subhash Goud

|

Updated on: May 08, 2024 | 5:19 PM

సాధారణంగా ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉంటేంది. గతంలో బ్యాంకు అకౌంట్‌ తీయాలంటే ఎంతో ప్రాసెస్‌ ఉండేది. బ్యాంకుకు వెళ్లి పేజీల కొద్ది వివరాలు నమోదు చేసిన తర్వాతే అప్పుడు ఖాతా యాక్టివ్‌ అయ్యేది. కానీ ఇప్పుడున్న రోజుల్లో ఫోన్‌ ద్వారా, ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా అకౌంట్‌ తీసుకునే సదుపాయం వచ్చింది. కానీ ఖాతాను సరిగ్గా మెయింటెన్‌ చేస్తే మంచిది. లేకుంటే పెనాల్టీ ఛార్జీలు వేయడం, లేదా అకౌంట్‌ క్లోజ్‌ కావడం జరుగుతంది. తాజాగా ఓ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది.

మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఖాతా ఉందా? అవును అయితే, ఈ వార్త మీకు చాలా ప్రత్యేకమైనది. నిజానికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు వారి ఖాతాలో గత మూడు సంవత్సరాలుగా లావాదేవీలు జరగని, ఖాతాలో డబ్బు లేని ఖాతాదారులకు హెచ్చరిక జారీ చేసింది. అలాంటి ఖాతాలు ఒక నెలలో మూసివేయనుంది. అటువంటి పరిస్థితిలో మీరు 3 సంవత్సరాల పాటు మీ పీఎన్‌బీ ఖాతాలో ఎటువంటి లావాదేవీలు చేయకుంటే నిర్ణీత వ్యవధిలో ఖచ్చితంగా చేయండి. బ్యాంకు తెలిపిన వివరాల ప్రకారం..

పీఎన్‌బి ఎందుకు ఈ చర్య తీసుకుంది?

గత మూడేళ్లుగా తమ ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరగకుండా, వారి ఖాతా బ్యాలెన్స్ కూడా శూన్యంగా ఉంటే, నెలలోపు వారి ఖాతాలను సస్పెండ్ చేస్తామని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన ఖాతాదారులను హెచ్చరించింది. ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా అటువంటి అన్ని ఖాతాల గణన ఏప్రిల్ 30, 2024 ఆధారంగా జరుగుతుందని తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన నోటిఫికేషన్‌లో ఒక నెల తర్వాత నోటీసు లేకుండానే మూసివేయనున్నట్లు పేర్కొంది. అయితే, డీమ్యాట్ ఖాతాలకు లింక్ చేసిన అటువంటి ఖాతాలు మూసివేయదు. అదే సమయంలో 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్‌లతో ఉన్న విద్యార్థుల ఖాతాలు, మైనర్‌ల ఖాతాలు, అంటే SSY/PMJJBY/PMSBY/APY వంటి పథకాల కోసం తెరిచిన ఖాతాలు కూడా నిలిచిపోవు. యధావిధిగా కొనసాగనున్నాయి.

మీ ఖాతాకు సంబంధించిన ఏదైనా సమాచారం కావాలనుకుంటే లేదా ఏదైనా సహాయం తీసుకోవాలనుకుంటే, మీరు నేరుగా మిమ్మల్ని సంప్రదించవచ్చని ఈ విషయంలో సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ఖాతాదారులకు బ్యాంక్ తెలియజేసింది. బ్యాంకు శాఖను సందర్శించడం ద్వారా సంప్రదించవచ్చు. పీఎన్‌బీ ప్రకారం.. ఖాతాదారుడు సంబంధిత బ్రాంచ్‌లో తన ఖాతా కేవైసీకి సంబంధించిన అన్ని అవసరమైన పత్రాలను సమర్పించనంత వరకు అటువంటి ఖాతాలను మళ్లీ యాక్టివేట్ చేయడం సాధ్యం కాదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి