Acharya First Review: మెగాస్టార్‌ ఆచార్య మూవీ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. థియేటర్లలో రచ్చ రచ్చే..

|

Apr 25, 2022 | 5:50 PM

Acharya: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) 152వ చిత్రంగా తెరకెక్కిన ఆచార్యపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇంత వరకు అపజయం ఎరగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) తండ్రితో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో...

Acharya First Review: మెగాస్టార్‌ ఆచార్య మూవీ ఫస్ట్‌ రివ్యూ వచ్చేసింది.. థియేటర్లలో రచ్చ రచ్చే..
Acharya First Review
Follow us on

Acharya First Review: మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) 152వ చిత్రంగా తెరకెక్కిన ఆచార్యపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ఇంత వరకు అపజయం ఎరగని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడం, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan) తండ్రితో కలిసి నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఓవైపు చిరంజీవి, రామ్‌చరణ్‌ల మాస్‌ ఇమేజ్‌ను క్యారీ చేస్తూనే మరోవైపు, తనదైన శైలిలో సందేశాత్మక కథతో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేయడానికి సిద్ధమయ్యాడు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 29న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌ బిజీబిజీగా గడుపుతున్నారు.

ఇక ఎన్నో అంచనాల నడుమ విడుదల కానున్న ఈ సినిమా మెగా అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ను అందిస్తుందని అభిమానులు ఇప్పటికే ఫిక్స్‌ అయ్యారు. తాజాగా ప్రముఖ క్రిటిక్‌, సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌ చేసిన ఓ పోస్ట్‌ మెగా అభిమానుల్లో జోష్‌ను నింపింది. యూఏఈ సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌ ఉమైర్‌ సంధు ట్విట్టర్‌ వేదికగా ఆచార్య రివ్వ్యూను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఉమైర్‌ ఆచార్య చిత్రం, చిరంజీవి, రామ్‌చరణ్‌ల నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాకు ఏకంగా 4 రేటింగ్‌ ఇవ్వడం విశేషం.

ఇక సినిమా గురించి ఉమైర్‌ విశ్లేషణ చూస్తే.. ఆచార్య సినిమా మాస్‌ ప్రేక్షకులకు అలరించే విధంగా ఉంటుంది. చిరు, చరణ్‌ల నుంచి అభిమానులు ఏం కోరుకుంటున్నారో అన్ని అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. చిరు, చరణ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని, మరోసారి చరణ్‌ తన నటనతో మెప్పించాడని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా పైసా వసూల్‌ లాంటిదని స్పష్టం చేశాడు ఉమైర్‌ సంధు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: Realme Narzo 50A Prime: రియల్‌మి నార్జో 50A ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌.. ధర, ఫీచర్ల గురించి తెలుసుకోండి..!

Revanth Reddy -PK: అందుకే కేసీఆర్‌ను కలిశాడు.. పీకేపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

Viral Video: బుడ్డోడితో ఓ ఆటాడుకున్న జిరాఫీ.. సోషల్ మీడియాలో తెగ వైరల్..