AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Vega Producer: జీవితా రాజశేఖర్‌కు డబ్బు పిచ్చి.. గరుడ వేగా నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

Ggaruda Vega Producer : రాజశేఖర్ (Rajsekhar) హీరోగా తెరకెక్కిన గరుడ వేగ సినిమా లావాదేవీలపై వివాదం రోజు రోజుకీ తీవ్రమవుతుంది. జీవితా రాజశేఖర్( Jeevitha Rajasekhar ) చేసిన వ్యాఖ్యలపై గరుడవేగ సినిమా ..

Garuda Vega Producer: జీవితా రాజశేఖర్‌కు డబ్బు పిచ్చి.. గరుడ వేగా నిర్మాత సంచలన వ్యాఖ్యలు..
Garuda Vega Producer
Surya Kala
|

Updated on: Apr 25, 2022 | 5:02 PM

Share

Garuda Vega Producer: రాజశేఖర్ (Rajsekhar) హీరోగా తెరకెక్కిన గరుడ వేగ సినిమా లావాదేవీలపై వివాదం రోజు రోజుకీ తీవ్రమవుతుంది. జీవితా రాజశేఖర్( Jeevitha Rajasekhar ) చేసిన వ్యాఖ్యలపై గరుడవేగ సినిమా నిర్మాత కోటేశ్వర రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవితా రాజశేఖర్ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు జీవితా రాజశేఖర్ మాపై చేస్తోన్నవన్నీ అసత్య ఆరోపణలనే అన్నారు. అసలు వారి ఇంట్లో దొరికిన దృశ్యాలకు మాకు ఏం సంబంధం… గతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద కోట్ల రూపాయలు సీజ్ చేశారు.. ఇప్పుడు మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. నిజానికి జీవితా రాజశేఖర్ ప్రోడ్యూసర్లను ట్రాప్ చేస్తుంది.. కానీ మేము ఆమె ట్రాప్ లో పడం.. మేము లండన్ నుండి వచ్చాము..  ఆవలిస్తే పేగులు లెక్కిస్తామన్నారు కోటేశ్వర రాజు.

అంతేకాదు.. జీవితా రాజశేఖర్ తన మామను తీసుకొచ్చి నా భార్య హేమ కాళ్లు పట్టుకుని కోట్ల రూపాయలు అప్పు తీసుకుందని చెప్పారు. నిజానికి రాజ శేఖర్ కు డబ్బు అవసరంలేదు.. అతని భార్య జీవితకు డబ్బు అవసరం ఉంది.. అందుకనే ఆమె తన కూతళ్లను అడ్డుపెట్టుకుని ఇప్పుడు డబ్బు గుంజే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జీవిత గతంలో చాలాసార్లు మోసం చేసిందని రాజశేఖర్ తండ్రి వరదరాజన్ మా దగ్గర ఎన్నోసార్లు బాధపడ్డారు. జీవితా చిలక పలుకులు మీడియాతో కాదు… కోర్టు వద్ద పలకాలంటూ  కోటేశ్వర రాజు ఎద్దేవా చేశారు.

రాజశేఖర్ కు డబ్బు తీసుకున్న రోజు మేము దేవుళ్లుగా కనిపించాం. ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాం కనుక కనిపించలేదా అంటూ ప్రశ్నించారు. జీవితకు కోర్టు సమన్లు వెళ్లాయనడానికి మావద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి.. డాక్యుమెంట్లు పోయాయని 420 వేశాలు వేసింది జీవితా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. నను ఇరికి ఇరికించడం జీవితా రాజశేఖర్ తరం కాదని కోటేశ్వర రాజు పేర్కొన్నారు. రాజశేఖర్ కోసం తన తమ్ముడి దగ్గర డ్రగ్స్ తెప్పించుకుంది జీవితా రాజశేఖర్ అంటూ సంచలన విషయాలను వెల్లడించారు. రాజశేఖర్ తో సినిమా తీసేవాళ్లు లేరు, సినిమా విడుదలైతే చూసేవాళ్లు ఎవరూ లేరంటూ ఎద్దేవా చేశారు గరువేగ సినీ నిర్మాత కోటేశ్వర రాజు.

Also Read: Viral Video: దోశ విక్రేత అసాధారణ నైపుణ్యం.. ఫ్లయింగ్ దోశ ప్రముఖ్య వ్యాపార వేత్తను ఆకట్టుకున్న ప్రత్యేక శైలి.. వీడియో వైరల్

Acharya Movie: మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమాకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..