Viral Video: దోశ విక్రేత అసాధారణ నైపుణ్యం.. ఫ్లయింగ్ దోశ ప్రముఖ్య వ్యాపార వేత్తను ఆకట్టుకున్న ప్రత్యేక శైలి.. వీడియో వైరల్

Viral Video: ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు.. తమ క్రియేటివిటీతో పదిమందిని ఆకట్టుకుంటూ.. తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకునే సామాన్య వ్యక్తులు సైతం అనేక మంది ఉన్నారు. సోషల్ మీడియా..

Viral Video: దోశ విక్రేత అసాధారణ నైపుణ్యం.. ఫ్లయింగ్ దోశ  ప్రముఖ్య వ్యాపార వేత్తను ఆకట్టుకున్న ప్రత్యేక శైలి.. వీడియో వైరల్
Dosa Making Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 25, 2022 | 4:30 PM

Viral Video: ప్రతిభ ఏ ఒక్కరి సొంతం కాదు.. తమ క్రియేటివిటీతో పదిమందిని ఆకట్టుకుంటూ.. తమకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకునే సామాన్య వ్యక్తులు సైతం అనేక మంది ఉన్నారు. సోషల్ మీడియా(Social Media) ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన అనంతరం సోషల్ మీడియాలో డిఫరెంట్ వీడియోలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.  తాజాగా ఓ  ఫుడ్ విక్రేత వీడియో సోషల్ మీడియాలో ఓ రెంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలోని దోశ విక్రేత.. తన కస్టమర్స్ కు క్రిస్పీ దోసెను అందిస్తున్న విధానం అద్భుతంగా ఉంది. చాలా మంది దీన్ని ఫ్లయింగ్ దోశ అని కూడా అంటున్నారు. ఎందుకంటే దోశను తయారు చేసిన తర్వాత.. ఆ మనిషి దానిని మడతపెట్టి నేరుగా గాలిలోకి విసిరేస్తాడు. దాన్ని పట్టుకోవడానికి.. మళ్ళీ ఆదోశను కస్టమర్స్ కు సర్వ్ చెయడానికి అక్కడ ఒక సహాయకుడు ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన దోశ విక్రయదారుడి(Dosa making) శైలికి దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా(Harsh Goenka) కూడా ఆశ్చర్యపోయారు. వీడియోను పంచుకుంటూ.. మీరు ఈ వ్యక్తిని అభినందిచాలనుకుంటే.. మీరు కూడా మీరు చేస్తోన్న పనిని ప్రేమించండి అంటూ వీడియో కి ఓ కామెంట్ ను జత చేశాడు.

వైరల్ అవుతున్న క్లిప్‌లో, దోసెను తయారు చేసిన తర్వాత, వ్యక్తి దానిని ఎడమ వైపున గాలిలో విసురుతున్నాడు. అయితే చూసేవారు ఈ దోశ నేలమీద పడిపోతుందేమో .. అయ్యో అనుకుంటారు. అయితే అలా దుకాణదారుడు దోశను గాలిలోకి విసిరిన వెంటనే బండి పక్కనే నిల్చున్న వ్యక్తి దానిని ప్లేట్‌లో పట్టుకోవడం వీడియోలో చూడవచ్చు. ఈ సమయంలో, దోశలు తయారు చేస్తున్న వ్యక్తి..  నిరంతరం దోశను తయారు చేస్తూనే .. అలా ఎటువైపు చూడకుండా.. తల ఎత్తకుండా.. గాలిలోకి దోశను విసిరివేస్తున్నాడు. అదే సమయంలో  గాలిలో ఉన్న దోశను పట్టుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఓ వ్యక్తి ఉన్నాడు.

‘ఫ్లయింగ్ దోస’ వీడియో:

ఈ వీడియోను ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అప్‌లోడ్ చేసిన 24 గంటల్లోనే    43 వేలకు పైగా వీక్షించగా,  2 వేల మంది లైక్ చేశారు. 200 మందికి పైగా రీట్వీట్ చేశారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా ప్రతిరోజూ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికరమైన, సృజనాత్మక పోస్ట్‌లను షేర్ చేస్తూనే ఉంటారనే విషయం తెలిసిందే. అతని అభిమానులు ఆ వీడియోలను చాలా ఇష్టపడతారు. అందుకే అతను ఏదైనా పోస్ట్‌ను షేర్ చేసిన వెంటనే అది వైరల్‌గా మారుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్క క్లిక్ చేయండి…

Also Read: Telangana: పేదవారికి మరింత చెరువుగా వైద్యం.. రేపు మూడు ఆస్పత్రులకు భూమిపూజ చేయనున్న సీఎం కేసీఆర్

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే