Telangana: పేదవారికి మరింత చెరువుగా వైద్యం.. రేపు మూడు ఆస్పత్రులకు భూమిపూజ చేయనున్న సీఎం కేసీఆర్

Telangana: ఢిల్లీ ఎయిమ్స్(Delhi AIIMS) తరహాలో హైదరాబాద్(Hyderabad) నగరం నలువైపులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను(Super Speciality Hospitals) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది..

Telangana: పేదవారికి మరింత చెరువుగా వైద్యం.. రేపు మూడు ఆస్పత్రులకు భూమిపూజ చేయనున్న సీఎం కేసీఆర్
Cm Kcr
Follow us
Surya Kala

|

Updated on: Apr 25, 2022 | 4:03 PM

Telangana: ఢిల్లీ ఎయిమ్స్(Delhi AIIMS) తరహాలో హైదరాబాద్(Hyderabad) నగరం నలువైపులా సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను(Super Speciality Hospitals) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు మూడు ఆసుపత్రులకు భూమి పూజ చేయనున్నరు ముఖ్యమంత్రి కేసీఆర్. ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌.. కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలకు ఈ ధర్మాసుపత్రులే దిక్కు. రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలు ఏ పెద్ద రోగమొచ్చినా వీటినే ఆశ్రయిస్తారు. ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి పెద్ద సంఖ్యలో పేషేంట్ లు వస్తుంటారు. ఏళ్లు గడిచినా, జనాభా పెరిగినా.. ఈ ఆస్పత్రులపై భారం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రేపు భూమి పూజ చేయనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.కరోనా ఉధృతి సమయంలో గచ్చిబౌలిలో టిమ్స్‌ను ఏర్పాటు చేసి సేవలందించగా, ఈ మూడింటితో కలిపి టిమ్స్‌ దవాఖానల సంఖ్య నాలుగుకు చేరనున్నాయి.

నిరుపేద రోగులకు రూపాయి ఖర్చు లేకుండా సూపర్‌ స్పెషాలిటీ వైద్యమందించేందుకు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యను బలోపేతంలో భాగంగా ఈ నాలుగు ఆసుపత్రులు ఉపయోగపడనున్నాయి.తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పేరుతో నిర్మించే మూడింటి నిర్మాణానికి 2,679 కోట్ల నిధుల కేటాయించింది ప్రభుత్వం.

ప్రస్తుతం నిర్మించనున్న ఒక్కో ఆసుపత్రి 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో..ఒక్కో దవాఖానలో వెయ్యి పడకలు..వైద్య విద్య కోసం పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఇన్ నర్సింగ్, పారామెడికల్ విద్యకు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అల్వాల్ లో 28.41 ఎకరాలలో జీ+5 ఎత్తులో 897 కోట్ల తో నిర్మాణము.ఎల్బీనగర్ లో 21.36 ఎకరాల్లో జీ+14 ఎత్తులో 900కోట్ల తో నిర్మాణం. సనత్ నగర్ లో 17 ఎకరాల్లో జీ+14 ఎత్తులో 882 కోట్ల తో ఆసుపత్రుల నిర్మాణం జరగనుంది.

ఈ నిర్మాణల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకుండా మెరుగైన వైద్యం కోసం నగరానికి వచ్చే పేదవారికి మంచి వైద్యం అందడమే కాకుండా…పెద్ద ఆసుపత్రుల పైన పడుతున్న భారం తగ్గనుంది.

Reporter : Yellender, Tv9 Telugu:

Also Read:  Akshaya Tritiya: కర్ణాటకలో మరో వివాదం.. వారి షాపుల్లో బంగారు ఆభరణాలు కొనొద్దంటూ..

Prashant Kishor: కాంగ్రెస్ పార్టీలో పీకే చేరికపై తర్జనభర్జనలు.. సోనియా నివాసంలో సీనియర్ నేతల కమిటీ మంతనాలు