AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు.. ఇద్దరు యువతులు, నిర్వాహకుడు అరెస్టు

హైదరాబాద్(Hyderabad) మహానగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, మోసాలు వంటి నేరాలతో భాగ్యనగరం చిగురుటాకులా వణుకుతోంది. నేర సంస్కృతి రోజురోజుకు...

Hyderabad: స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు.. ఇద్దరు యువతులు, నిర్వాహకుడు అరెస్టు
Spa
Ganesh Mudavath
|

Updated on: Apr 25, 2022 | 12:50 PM

Share

హైదరాబాద్(Hyderabad) మహానగరంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, మోసాలు వంటి నేరాలతో భాగ్యనగరం చిగురుటాకులా వణుకుతోంది. నేర సంస్కృతి రోజురోజుకు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో నార్సింగిలో వ్యభిచార ముఠాను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా వనస్థలిపురంలో స్పా మాటున వ్యభిచారం చేస్తున్న గ్యాంగ్ ను అరెస్టు చేశారు. స్పా(Spa) సెంటర్ మాటున వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. నిర్వాహకుడితో పాటు ముగ్గురిని అరెస్టు(Arrest) చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద.. స్పా సెంటర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. స్పా సెలూన్ లో క్రాస్‌ మసాజ్, స్పా మసాజ్‌ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యబిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ కాంప్లెక్స్‌లోని రెండు వేర్వేరు గదులలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువతులతో పాటు, నిర్వాహకుడు ఏరుకొండ రవీందర్‌ ను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.1,500 నగదు, నాలుగు సెల్‌ ఫోన్‌లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో హైదరాబాద్‌లో(Hyderabad) హైటెక్ సెక్స్ రాకెట్‌ గుట్టురట్టు అయింది. టెక్నాలజీ ఆధారంగా సెక్స్ రాకెట్ నడుపుతున్న ఉగాండా(Uganda) దేశానికి చెందిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ రాకెట్(Prostitution Rocket) నిర్వహించేందుకు ఉగాండా దేశీయులు ప్రత్యేక సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సీక్రెట్ కోడ్ ఎంటర్ చేస్తేనే విటులను లోపలికి అనుమతిచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ కు గురయ్యారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Also Read

Vijayawada: పురుగుల మందు తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నం.. అప్రమత్తమైన పోలీసులు ఏం చేశారంటే