AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: కొత్త కాంబినేషన్‌కు రంగం సిద్ధం.. ట్యాలెంట్‌డ్‌ హీరోతో జత కట్టనున్న అందాల రాశీ..

Sharwanand: కెరీర్‌ మొదటి నుంచి వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతోంది అందాల తార రాశీ ఖన్నా. తెలుగు, తమిళంతో పాటు హిందీలో ఏక కాలంలో సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఏకంగా ఆరు సినిమాలు..

Rashi Khanna: కొత్త కాంబినేషన్‌కు రంగం సిద్ధం.. ట్యాలెంట్‌డ్‌ హీరోతో జత కట్టనున్న అందాల రాశీ..
Narender Vaitla
|

Updated on: Jun 07, 2022 | 6:55 AM

Share

Rashi Khanna: కెరీర్‌ మొదటి నుంచి వరుస సినిమాలతో బిజీగా దూసుకుపోతోంది అందాల తార రాశీ ఖన్నా. తెలుగు, తమిళంతో పాటు హిందీలో ఏక కాలంలో సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్న ఈ చిన్నది తాజాగా మరో సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి రాశీ ఖన్నా శర్వానంద్‌తో జతకట్టనుందన్నది సదరు వార్త సారంశం. ప్రస్తుతం ‘ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసిన శర్వానంద్‌, త్వరలోనే కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నారు.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడిగా రాశీ ఖన్నా నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వా ఇప్పటి వరకు కనిపించిన పాత్రలో నటించనున్నాడని సమాచారం. ఇప్పటికే చిత్ర యూనిట్‌ రాశీ ఖన్నను సంప్రదించగా, ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఈ నెలలో సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఇక ఈ సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు శర్వా ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. మరి ఈ కొత్త జోడి నిజంగానే సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపిస్తారా.? లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. 50శాతం ఛార్జీలు పెంచిన TGSRTC
ప్రయాణికులకు బ్యాడ్‌ న్యూస్.. 50శాతం ఛార్జీలు పెంచిన TGSRTC
Telangana: ఆదిలాబాద్‌లో అద్భుతం.. వినాయక చవితి వేళ బయటపడ్డ..
Telangana: ఆదిలాబాద్‌లో అద్భుతం.. వినాయక చవితి వేళ బయటపడ్డ..
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గాయంటే..?
వారం రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గాయంటే..?
పూర్ణం బూరెలు.. ఇది వేశారంటే పూర్ణం బయటకురాకుండా రుచిగా వస్తాయ్
పూర్ణం బూరెలు.. ఇది వేశారంటే పూర్ణం బయటకురాకుండా రుచిగా వస్తాయ్
కేరళ నుంచి తిరిగొస్తూ.. ఎమోషనలైన పవన్ కల్యాణ్.. ఎందుకంటే?
కేరళ నుంచి తిరిగొస్తూ.. ఎమోషనలైన పవన్ కల్యాణ్.. ఎందుకంటే?
ఇవి రెండు టీ స్పూన్స్ తాగితే విరిగిన ఎముకలు కట్టుకుంటాయ్
ఇవి రెండు టీ స్పూన్స్ తాగితే విరిగిన ఎముకలు కట్టుకుంటాయ్
అప్పుడు స్టార్ హీరోలు కూడా నాకోసం ఎదురుచూశారు.. కానీ
అప్పుడు స్టార్ హీరోలు కూడా నాకోసం ఎదురుచూశారు.. కానీ
'కష్టాన్ని చూసి భయపడి ప్రయత్నాన్ని మధ్యలో ఆపకూడదు'.. నీతికథ
'కష్టాన్ని చూసి భయపడి ప్రయత్నాన్ని మధ్యలో ఆపకూడదు'.. నీతికథ
హర్తాలిక తీజ్ వ్రత కథ.. శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి..
హర్తాలిక తీజ్ వ్రత కథ.. శివుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..