Sanjjanaa Galrani: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో త్రిషతో పాటు నటించిన మరో హీరోయిన్ సంజనా గల్రానీ (Sanjjanaa Galrani). ఆ సినిమాలో వచ్చిరానీ తెలుగు భాష మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుందీ ముద్దుగుమ్మ. ఈ సినిమా తర్వాత సత్యమేవ జయతే, దుశ్శాసన, సర్దార్ గబ్బర్ సింగ్ వంటి సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించింది. కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ గతేడాది కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది. శాండల్ వుడ్ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో అరెస్టై, మూడు నెలల పాటు జైలు జీవితం అనుభవించింది. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చింది. జైలు నుంచి విడుదలైన వెంటనే ఆమె అజీజ్ బాషా అనే వ్యక్తితో పెళ్లిపీటలెక్కింది. ఆపై ఆమె కూడా ఇస్లాం మతాన్ని స్వీకరించింది. కాగా వారి దాంపత్య బంధానికి గుర్తుగా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది సంజన. ఈ క్రమంలో గత నెలలోనే ఒకసారి సీమంతం (Baby Shower) జరుపుకున్న ఈ అందాల తార తాజాగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి గ్రాండ్‌గా బేబీషవర్ వేడుకలు జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుని మురిసిపోయింది.
మెనూలో మటన్ బిర్యానీ అదిరిపోయింది..
కాగా గత నెలలో హిందూ సాంప్రదాయం ప్రకారంలో సీమంతం జరుపుకున్నానని, ఈసారి ముస్లిం సంప్రదాయ పద్ధతిలో బేబీషవర్ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది సంజన. ‘ఈ వేడుకల కోసం నా యోగక్షేమాలను పట్టించుకునే 300 మందికి ఆహ్వానం పంపాను. ఈ ఫంక్షన్‌కు హాజరై నన్ను, పుట్టబోయే బిడ్డను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ ఫంక్షన్ మెనూలో మటన్ బిర్యానీ అదిరిపోయింది . మరో 20 రోజుల్లో మా బుజ్జాయి ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టబోతుంది’ అని పేర్కొందీ సొగసరి. కాగా మరో పోస్టులో తన భర్త గురించి ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది సంజన. ‘డాక్టర్ సాబ్ (భర్త).. మీలాంటి వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం నా అదృష్టం. నువ్వే నా బలం, నా ఆనందం. జీవితంలోని కొన్ని గడ్డు పరిస్థితులు, కొందరు మనుషులు మనల్ని విడదీయడానికి చాలా ప్రయత్నించారు. అయితే దేవుడి దయ, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మా బంధం మరింత ధృడ పడింది’ అని ఎమోషనల్‌గా రాసుకొచ్చింది సంజన. కాగా ఈ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: