Daljeet Kaur Khangura: సినీ పరిశ్రమలో మరో విషాదం.. బ్రెయిన్ ట్యూమర్‏తో ప్రముఖ నటి కన్నుమూత..

గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న ఆమె.. నవంబర్ 17న పంజాబీలోని లూథియానాలో తుదిశ్వాస విడిచారు.

Daljeet Kaur Khangura: సినీ పరిశ్రమలో మరో విషాదం.. బ్రెయిన్ ట్యూమర్‏తో ప్రముఖ నటి కన్నుమూత..
Daljith Kaur

Updated on: Nov 18, 2022 | 12:10 PM

సూపర్ స్టార్ కృష్ణ మరణం మరువక ముందే సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ పంజాబీ నటి దల్జీత్ కౌర్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్న ఆమె.. నవంబర్ 17న పంజాబీలోని లూథియానాలో తుదిశ్వాస విడిచారు. 1976లో వెండితెరకు పరిచయమైన దల్జీత్.. పుట్ జట్టన్ దే, కీ బాను దునియా దా, సర్పంచ్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. పంజాబ్‏లో అగ్రకథానాయికగా పేరు సంపాదించుకున్న ఆమె.. దాదాపు 70 పంజాబీ చిత్రాల్లో.. 10కి పైగా హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు. దల్జీత్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

దల్జీత్ కౌర్.. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. పూణే ఫిల్మ్ ఇన్ స్టి్ట్యూట్ లో చేరారు. తన భర్త హర్మిందర్ సింగ్ డియోల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన తర్వాత చాలా కాలం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. 2001 లో మళ్లీ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు దల్జీత్. పంజాబీ చిత్రం సింగ్ వర్సెస్ కౌర్ లో గిప్పీ గ్రేవాల్ తల్లిగా నటించారు.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని తెలుగు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. నటశేఖరుడి జ్ఞాపకాలను పదిలంగా భద్రపరుచుకునేందుకు ఆయన స్మారకచిహ్నాన్ని పద్మాలయ స్టూడియో వద్ద ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు ఘట్టమనేని కుటుంబసభ్యులు.