బాలీవుడ్ లో బయోపిక్ ల హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా స్వాతంత్య్ర వీరుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణదీప్ హుడా త్వరలో ‘స్వాతంత్ర వీరుడు వీర్ సావర్కర్’గా కనిపించనున్నాడు. సావర్కర్ గా కనిపించడం కోసం రణదీప్ హుడా తనని తాను మలచుకున్నాడు. ఎంతో కష్టపడ్డాడు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ ను చూస్తే ఆ విషం స్పష్టమవుతుంది. వీర్ సావర్కర్ బయోపిక్‌లో నటించింది నిజంగా నటించింది రణదీప్ హుడానేనా అనిపించక మానదు ఎవరికైనా.. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు.. గుర్తించడం కూడా కష్టం. ఈ సినిమా కోసం కేవలం 4 నెలల్లోనే 26 కిలోల బరువు తగ్గాడు రణదీప్.
వీర్ సావర్కర్ బయోపిక్ కోసం రణదీప్ హుడా 26 కిలోల బరువు తగ్గించుకున్నాడు. చిత్ర నిర్మాత ఆనంద్ పండిట్ మాట్లాడుతూ రణదీప్ తన పాత్ర కోసం చాలా కష్టపడ్డాడని.. బరువు తగ్గడం కోసం మొత్తం 4 నెలల పాటు రోజుకు ఖర్జూరం తిన్నాడని.. ఒక గ్లాస్ పాలు మాత్రమే తాగాడని చెప్పారు. దీంతో రణదీప్ బరువు తగ్గాడని తెలిపారు ఆనంద్. రణదీప్ హుడా ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడు.. అతని బరువు 86 కిలోలు.
ఈ సినిమాలో వీర్ సావర్కర్ పాత్రలో నటిస్తున్న రణదీప్ హుడా .. సావర్కర్ లా కనిపించే విధంగా తనని తాను పలుచుకున్నాడు. జుట్టు, కట్టు బొట్టు అన్నిటిని అలవాటు చేసుకోవడం కోసం రణదీప్ హుడా చాలా రీసెర్చ్ చేసాడు. స్వయంగా వీర్ సావర్కర్ మనవడిని కలుసుకుని సావర్కర్ గురించిన సమాచారం తెలుసుకున్నారు. టీజర్‌లో రణదీప్ వాయిస్, నటన చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇంకా చెప్పాలంటే నిజంగా సావర్కర్ ను చుస్తున్నామా అన్నట్లుంది అని అంటున్నారు.
అయితే ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే.. రణదీప్ హుడా ఈ సినిమాతో దర్శకుడిగా వెండి తెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. ముందుగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించే బాధ్యతను మహేష్ మంజ్రేకర్‌కు అప్పగించారు.. అయితే అతని డేట్ లభించకపోవడంతో.. చిత్ర నిర్మాత ఆనంద్ పండిట్.. రణదీప్ హుడానే దర్శకత్వం వహించమని అడిగాడు.
మే 28న వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘స్వాతంత్ర వీర్ సావర్కర్’ టీజర్‌ని అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. ‘స్వతంత్ర వీర్ సావర్కర్’ దాదాపు 2,000 స్క్రీన్లపై విడుదల కానుంది.
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..