Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ నటి కంగనాకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చిన యూపీ సీఎం.. మురిసిపోతున్న రీల్ తలైవి

Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శుక్రవారంనాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వ పనితీరును ఆమె మెచ్చుకున్నారు.

బాలీవుడ్ నటి కంగనాకు ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చిన యూపీ సీఎం.. మురిసిపోతున్న రీల్ తలైవి
Kangana Meets Yogi
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 02, 2021 | 7:52 AM

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ శుక్రవారంనాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వ పనితీరును ఆమె మెచ్చుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళా భద్రతకు యోగి ఆదిత్యనాథ్ తీసుకుంటున్న చర్యలను అభినందించారు. అలాగే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు యోగి ఆదిత్యనాథ్‌కు కంగనా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆమెను ప్రభుత్వ పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా యూపీ ప్రభుత్వం నియమించుకుంది.

ఈ సందర్భంగా జాతీయ ఉత్తమనటి కంగనాకు యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక గిఫ్ట్‌ను అందజేశారు. అయోధ్య రామాలయ భూమి పూజ కార్యక్రమంలో వాడిన కాయిన్‌ను కంగనాకు యోగి ఆదిత్యనాథ్ బహుకరించారు. లక్ష్మణ ఆంజనేయ సహిత సీతారాములున్న రామ దర్బార్ ఆ కాయిన్‌పై ఉంది. యోగితో భేటీకి సంబంధించిన ఫోటోలతో పాటు ఆయన ఇచ్చిన ప్రత్యేక గిఫ్ట్ ఫోటోను కంగనా ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేశారు. తనకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు కంగనా ఎంతో మురిసిపోయింది.

అలాగే తమ సినిమా షూటింగ్(తేజాస్)కు సహకరించినందుకు యూపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినట్లు కంగనా ఇన్‌స్టాలో వెల్లడించారు. అలాగే వచ్చే ఎన్నికలకు ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. యోగి ఆదిత్యానాథ్‌తో భేటీ ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.

కంగనాకు ప్రత్యేక గిఫ్ట్‌ను అందజేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్..

Also Read..

Leharaayi Song: యూట్యూబ్‏లో రికార్డ్స్ సృష్టిస్తున్న అఖిల్ సాంగ్.. మిలియన్ వ్యూస్ అందుకుంటున్న లెహరాయి పాట..

IPL 2021 Points Table: ఉత్కంఠగా కొనసాగుతోన్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్.. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఏయే జట్లు ఉన్నాయంటే..?