Tollywood: ఉత్తమ నటిగా ఏకంగా 5 జాతీయ అవార్డులు.. 72 ఏళ్ల వయసులోనూ ముద్దు సీన్‌తో సంచలనం.. ఎవరో తెలుసా?

ఈ నటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింంది. తన అందం, అభినయంతో తిరుగులేని హీరోయిన్ గా వెలుగొందింది. తన నటనా ప్రతిభకు ఏకంగా 5 జాతీయ అవార్డులను కూడా అందుకుంది. ఇప్పుడు 72 సంవత్సరాల వయసులోనూ ముద్దు సీన్ లో నటించి మరోసారి అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది.

Tollywood: ఉత్తమ నటిగా ఏకంగా 5 జాతీయ అవార్డులు.. 72 ఏళ్ల వయసులోనూ ముద్దు సీన్‌తో సంచలనం.. ఎవరో తెలుసా?
Bollywood Actress

Updated on: Aug 24, 2025 | 6:59 AM

సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. పెళ్లి, పిల్లల తర్వాత చాలా మంది కథానాయికలు సినిమాలు తగ్గించేస్తారు. కొద్ది మందైతే ఏకంగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోతారు. అదే సమయంలో మరికొందరు పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నప్పటికీ సినిమాల్లో నటిస్తుంటారు. ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఈ నటిది సినిమా ఇండస్ట్రీలో సుమారు 50 ఏళ్ల ప్రస్థానం. వందలాది సినిమాల్లో నటించి మెప్పించింది. తన అభినయ ప్రతిభతో ఐదు జాతీయ అవార్డులతో పాటు లెక్కలేనన్నీ పురస్కారాలు అందుకుంది. ఇప్పుడు కూడా సినిమాల్లో నటిస్తోన్న ఆమె 72 ఏళ్ల వయసులో ముద్దు సీన్ లో నటించి వార్తల్లో నిలిచింది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ దిగ్గజ నటి షబానా అజ్మీ. 1970-80 లలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారామె. తన నటనా ప్రతిభకు ప్రతీకగా ఏకంగా ఐదు జాతీయ అవార్డులు అందుకుంది. షబానా అజ్మీ 1975లో తన మొదటి జాతీయ అవార్డును అందుకుంది. 1974లో విడుదలైన ‘అంకుర్’ చిత్రానికి గానూ ఆమె ఈ అవార్డును అందుకుంది. 1983లో ‘ఆర్థ్’ చిత్రానికి రెండవ జాతీయ అవార్డును అందుకుంది.

ఇక 1984లో ‘ఖాంధార్’ చిత్రానికి మూడవ జాతీయ అవార్డును అందుకుంది. షబానా అజ్మీ. 1985లో ‘పార్’ చిత్రానికి నాలుగో జాతీయ అవార్డును, 1999లో ఐదవ జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ విధంగా, ఆమె మొత్తం 5 జాతీయ అవార్డులను అందుకుంది.

ఇవి కూడా చదవండి

షబానా ఆజ్మీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

పాత్రకు తగ్గట్టుగానే నటించా..

షబానా అజ్మీ ప్రస్తుత వయసు సుమారు 74 సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా ఆమె సినిమాల పట్ల అదే అభిరుచిని కొనసాగిస్తుంది. పాత్రలకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటోంది. కాగా 2023 లో విడుదలైన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’లో, షబానా నటుడు ధర్మేంద్రతో కలిసి ఓ ముద్దు సీన్ లో యాక్ట్ చేసింది. దీంతో మరోసారి షబానా పేరు వార్తల్లోకి ఎక్కింది. దీనిపై కొందరు విమర్శలు గుప్పించినా తన దైన శైలిలో తిప్పి కొట్టిందీ అందాల తార.

శ్రీదేవి, సోనాలి బింద్రేలతో షబానా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.