Sonu Sood: రీల్ హీరోగా మారిన రియల్ హీరో.. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సోనూసూద్ సినిమా..

|

Dec 23, 2021 | 6:52 PM

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా.. భయంకరమైన విలన్ పాత్రలలో నటించి మెప్పించారు

Sonu Sood: రీల్ హీరోగా మారిన రియల్ హీరో.. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సోనూసూద్ సినిమా..
Sonu Sood
Follow us on

టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గా.. భయంకరమైన విలన్ పాత్రలలో నటించి మెప్పించారు సోనూసూద్. ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు సోనూసూద్. ఇప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్‏గానే సినిమాల్లో కనిపించిన సోనూసూద్ ఇప్పుడు హీరోగా కనిపించబోతున్నారు. కరోనా సంక్షోభంలో వలస కార్మికుల కోసం ముందుకు వచ్చి తనవంతు సాయం చేసి రియల్ హీరో అయ్యారు సోనూసూద్. దేశవ్యాప్తంగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచి అపద్భాంధవుడయ్యాడు సోనూసూద్. అందుకే సోనూసూద్‏ను దైవంగా కొలుస్తుంటారు. తమ వ్యాపార సంస్థలకు సోనూసూద్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు మరికొందరు. ఇప్పటివరకు రియల్ హీరోగా ఉన్న సోనూసూద్ ఇప్పుడు రీల్ హీరోగా మారబోతున్నారు.

బాలీవుడ్‏లో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సోనూసూద్ హీరోగా ఫతేహ్ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేస్తూ.. ఆ సినిమా నుంచి సోనూసూద్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇండియాలో దాగి ఉన్న శత్రువుపై చేస్తున్న వన్ మ్యాన్ పోరాటమే ఫతేహ్. 2022 ఏడాదిని మరింత యాక్షన్ తో స్వాగతిస్తున్నా. ఈ కథ నాలో ఆసక్తిని రేకెత్తించింది.. స్క్రిప్ట్ చదవిన వెంటనే ఇందులో భాగమవ్వాలని కోరుకున్నాను.. ఆలోజింపచేసే ఈ కథను అందరి దృష్టికి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు సోనూసూద్. ఈచిత్రానికి బాజీరావ్ మస్తానీ, పద్మావత్ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన అభినందన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్, శక్తిసాగర్ ప్రొడక్షన్స్, ఫర్హాద్ సంజీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. సోనూసూద్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Radhe Shyam Pre Release Event Live: ఘనంగా రాధేశ్యామ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లైవ్..

Anasuya: పుష్పలో దాక్షయణి పాత్రకు అనసూయ ఎంత తీసుకుందో తెలుసా ?.. ఒక్క రోజు రెమ్యునరేషన్ ఎంతంటే..

Pushpa: బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోన్న పుష్ప వసూళ్ల వర్షం.. హిందీలో కూడా తగ్గేదేలే అంటోన్న పుష్పరాజ్‌..

Shyam Singha Roy: నాని సినిమా నుంచి మరో సర్‌ప్రైజ్‌.. మంచి మెలోడి పాటను విడుదల చేసిన మూవీ యూనిట్‌..